ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్..!!

జగన్ అన్న వసతి దీవెన పథకం కింద నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల తల్లుల ఖాతాలోకి జగన్ సర్కార్ డబ్బులు అందిస్తోంది.ఈ పథకం ద్వారా  2020–21 సంవత్సరానికి 10,89,302 విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 1,048.94 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించనుంది.ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే రీతిలో జగన్ గత ఏడాది ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కొన్ని కోట్ల రూపాయలు విద్యార్థుల ఫీజుల కింద విద్యా సంస్థలకు చెల్లించటం జరిగింది. 

 Good News For Students In Ap  Ys Jagan, Andhra Pradesh, Ap Cm , Jaganananna Vast-TeluguStop.com

తాజాగా జగన్ అన్న వసతి దీవెన పథకం ద్వారా విద్యార్థుల భోజన మరియు రవాణా ఖర్చులకు సంబంధించి డబ్బులు తల్లుల ఖాతాలోకి జమ చేస్తోంది.

ఈ పథకంలో భాగంగా ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ అదేవిధంగా ఆ పై చదువులు చదివే వారికి 20 వేల చొప్పున డబ్బులు విద్యార్థుల తల్లుల అకౌంట్ లో జగన్ ప్రభుత్వం వేయనుంది.తొలివిడతగా నేడు కార్యక్రమం జరగగా, రెండో విడత ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్ మాసంలో పథకం అమలు చేయాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

ఏది ఏమైనా పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి హామీ నెరవేరుస్తూ ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube