శ్రీవారి భక్తులకు శుభవార్త..!

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు ఒక శుభవార్త తెలిపింది.భక్తులకు నడక దారి వైపు వెళ్లేందుకు అనుమతి రద్దు చేసిన టీటీడీ ఈనెల 11న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నడకదారి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.

 Good News For Srivari Devotees Ttd, Tirumala, Srinivasa, By Walk, Alipiri, Andra-TeluguStop.com

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.కానీ చాలామంది నడక మార్గంలో వెళ్లి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.అయితే అలిపిరి నడక దారి పైన దశాబ్దాల క్రితం నిర్మించిన పైకప్పు శిధిలావస్థకు చేరుకుంది.దీంతో అలిపిరి మెట్ల మార్గం లో పై కప్పు కొత్తగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్న టీటీడీ నడక మార్గంలో మరమ్మతులు, ఆధునీకరణ పనుల కోసం గతేడాది సెప్టెంబర్ లో భక్తులకు నడక దారి అనుమతిని రద్దు చేసి పనులు ప్రారంభించింది.

పనులు వేగవంతం చేయడానికి ఈ ఏడాది జూన్ 1 నుంచి భక్తులకు నడక మార్గం ద్వారా వెళ్లేందుకు అనుమతి రద్దు చేసింది.

Telugu Alipiri, Walk, Srinivasa, Tirumala-Latest News - Telugu

నడక మార్గం మరమ్మతులకు అయ్యే మొత్తం ఖర్చు 25 కోట్ల రూపాయలను రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ టిటిడికి విరాళంగా చెప్పడానికి ముందుకు వచ్చింది.అలిపిరి పాదాల మండపం వద్ద అ నుంచి గాలిగోపురం వరకు 1.4 కిలోమీటర్ల మేర మెట్లదారిలో 7.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసి సిద్ధం చేశారు.17.5 కోట్ల రూపాయలు కేటాయించి గాలి గోపురం నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు మూడు కిలోమీటర్ల మేర పైకప్పుకు ఆర్సిసి స్లాబ్ ఏర్పాటు చేశారు.అయితే నడకదారిలో ని నరసింహ స్వామి వారి ఆలయం నుంచి తిరుమల వరకు ఉన్న పైకప్పు కొత్తగా నిర్మించినది కావడంతో దానికి ఎటువంటి మరమ్మతులు నిర్వహించలేదు.

Telugu Alipiri, Walk, Srinivasa, Tirumala-Latest News - Telugu

ప్రస్తుతం అలిపిరి నుంచి తిరుమల కాలినడక మార్గం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.పైకప్పు నిర్మాణం పూర్తి చేయడంతోపాటు విద్యుత్, వాటర్ వర్క్స్ పనులు కూడా దాదాపు పూర్తి అయిపోయాయి.దీంతో ఈ నెల 11 నుంచి తిరుమలకు వెళ్లే నడక మార్గాన్ని టిటిడి భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది.తిరుపతిలోని శ్రీనివాసం అలిపిరి వద్ద నుంచి నడిచి వెల్లి మొక్కులు చెల్లించుకుని భక్తులకోసం శ్రీవారి మెట్టు వరకు టిటిడి ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది.

మరో రెండు రోజుల్లో అలిపిరి మార్గం ప్రారంభమవుతుండడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube