SBI కస్టమర్లకు శుభవార్త.. FDలపై భారీగా వడ్డీ రేట్ల పెంపు!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది.పరిమిత కాల డిపాజిట్లపై (ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది.

 Good News For Sbi Customers Huge Interest Rate Hike On Fds Sbi-TeluguStop.com

ఒక వారం వ్యవధిలో రెండు సార్లు వడ్డీ రేట్లలో మార్పులు చేసింది.పదేళ్ల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకుంది.

పెంచిన కొత్తరేట్లు జనవరి 22 నుంచి వర్తించనున్నాయి.ఎస్బీఐ నిర్ణయం ప్రకారం వడ్డీ రేట్లు ఎంత పెరిగాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎస్బీఐ ప్రస్తుతం రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.10 శాతం వడ్డీని అందిస్తోంది.గతంలో ఈ వడ్డీ రేటు 5 శాతంగా ఉండేది.

ఒక వారం వ్యవధిలో స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు FD రేటును 2 సార్లు పెంచి ప్రయోజనాన్ని అందించింది.మరోవైపు సాధారణ డిపాజిటర్ల కంటే సీనియర్ సిటిజన్లకే ఎక్కువగా వడ్డీ ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ నిర్ణయించింది.సీనియర్ సిటిజన్లకు 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీకి 5.60 శాతం వడ్డీ లభిస్తుంది.గతంలో ఈ రేటు 5.50 శాతంగా ఉండేది.ఎస్బీఐ గతేడాది జనవరిలో FD వడ్డీ రేట్లను పెంచింది.

కొత్త వడ్డీ రేట్ల ప్రకారం. 7 నుంచి 45 రోజులు – సాధారణ ప్రజలకు 2.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.40 శాతంగా రానుంది.46 రోజుల నుంచి 179 రోజుల వరకు జనరల్ 3.90 శాతం, సీనియర్ సిటిజన్ 4.40 శాతంగా ఉంది.180 నుంచి 210 రోజుల వరకు జనరల్ 4.40 శాతం సీనియర్ సిటీజన్ 4.90 శాతంగా ఇస్తున్నారు.211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ జనరల్ 5.10 శాతం, సీనియర్ సిటీజన్ 5.60 శాతంగా ఉంది.2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు కంటే తక్కువ FDలు -జనరల్ 5.10 శాతం, సీనియర్ సిటీజన్ 5.60 శాతం ఉంది.3 ఏళ్ల లోపు నుంచి 5 ఏళ్ల కంటే తక్కువ -జనరల్ 5.30 శాతం, సీనియర్ సిటీజన్ 5.80 శాతం.5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిటర్ 5.40, సీనియర్ సిటీజన్ 6.20 శాతంగా వడ్డీ రేట్లను అందిస్తోంది.

Good News For SBI Customers . Huge Interest Rate Hike On FDs!, SBI, Interest Hike, FD , January 22 , SBI Customers , New Rules, Senior Citizens - Telugu Interest, January, Sbi Customers, Senior Citizens

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube