ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు ఇక మంచి రోజులేనా ?

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సీఎం కెసిఆర్ ఎంత మొండి వైఖరితో ముందుకు వెళ్లారో అందరికీ తెలిసిందే.అప్పట్లో ఆయన వైకిరిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

 Good News For Rtc Women Employees-TeluguStop.com

అయినా కెసిఆర్ కార్మికుల డిమాండ్ విషయంలో మెత్త పడలేదు.ఉద్యోగాల్లో తక్షణమే జాయిన్ అవ్వాలని లేకపోతే అంతా సెల్ఫ్ డిస్మిస్ అయిపోతారు అంటూ హెచ్చరికలు చేశారు.

ఆ తరువాత ఆ ఉద్యమం మరింత తీవ్రతరమైంది.అయినా కేసీఆర్ తన నిర్ణయానికి కట్టుబడి పోయారు.

ఇక చేసేది లేక కార్మికులు, జేఏసీ నేతలు వెనక్కి తగ్గి ఎవరి విధుల్లో వారు చేరిపోయారు.అయితే అప్పటి వరకు కొంత కఠినంగా వ్యవహరించిన కెసిఆర్ ఇప్పుడు కార్మికుల విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు వరాల జల్లు కురిపిస్తున్నారు.మహిళా సిబ్బందికి రాత్రి సమయాల్లో డ్యూటీలు వేయొద్దు అంటూ కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో అన్ని డిపోల్లో ను మహిళా ఉద్యోగులకు సమయాలను మార్పు చేశారు.త్వరలోనే మహిళా ఉద్యోగులకు విశ్రాంతి గదులు తో పాటు యూనిఫార్మ్ కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు.

ఇటీవల ఆర్టీసీ మహిళా ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కేసీఆర్ అప్పుడు ఇచ్చిన హామీల మేరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు.ఆర్టీసీ లో పనిచేసే మహిళా ఉద్యోగుల డ్యూటీ టైమింగ్ మార్పు చేశారు.

ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకు కూడా విధులు నిర్వహించిన మహిళ కండక్టర్లు ఇకపై రాత్రి 8 గంటల లోపే తమ విధులను ముగించే అవకాశాన్ని కల్పించారు.అలాగే ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు కూడా మూడు నెలలపాటు చైల్డ్ కేర్ లీవ్ విషయంలో రెండు రోజుల్లో లో ఆదేశాలు ఇవ్వబోతున్నారు.

ప్రతి డిపోలను మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ మార్చుకునే రూములు, తాత్కాలికంగా ఏర్పాటు చేయబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube