రైల్వే ప్రయాణికులకు శుభవార్త! 5 నిమిషాల ముందు కూడా ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు, తెలుసా?

రోడ్డు ప్రయాణం కన్నా, రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంతో కూడుకున్నది.అందుకే దేశ ప్రజలందరూ దాదాపుగా రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు.

 Good News For Railway Passengers, Train Ticket Can Be Booked Even 5 Minutes Bef-TeluguStop.com

అయితే రైలు ప్రయాణానికి టికెట్‌ బుక్‌ చేయడం అనేది ప్రయాసతో కూడుకున్న వ్యవహారం.సుదూర ప్రయాణాలు చేయాలంటే కొన్ని రోజుల ముందు టికెట్‌ బుక్‌ చేసుకోవలసిన పరిస్థితి.

అదే రద్దీ రూట్లలో అయితే రెండు మూడు నెలలముందే రిజర్వేషన్ చేసుకోవాలి.లేదంటే రైలు ప్రయాణం కాస్త నరకప్రాయంగా మారుతుంది.

ఒకటి రెండు రోజుల ముందు ప్రయాణాలు నిర్ణయమైతే తత్కాల్ బుకింగే దిక్కు.ఒకవేళ అందులోనూ టికెట్‌ దొరక్కపోతే ఇక ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందే.

అయితే, ఇపుడు మీకు రైలు టికెట్‌ దొరకలేదని బాధపడాల్సిన అవసరం లేదు.టికెట్లు ఖాళీ ఉంటే రైలు బయల్దేరడానికి ఓ 5 నిమిషాల ముందు కూడా ఇకనుండి టికెట్‌ బుక్‌ చేసుకొనే వెసులుబాటు కలదు.

కౌంటర్‌ వద్ద గానీ, ఆన్‌లైన్‌లోగానీ టికెట్‌ బుక్ చేసుకోవచ్చు.చాలా రోజుల నుంచీ రైల్వే శాఖ ఈ సదుపాయం ఉన్నప్పటికీ చాలా మంది వినియోగించుకోవడం లేదు.రైలు బుక్‌ చేసుకోవడానికి రైల్వే శాఖ రెండు ఛార్ట్‌లను ప్రిపేర్‌ చేస్తుంది.ఫస్ట్‌ ఛార్ట్‌ అనేది రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు ప్రిపేర్‌ అవుతుంది.

రెండో ఛార్ట్‌ అనేది ప్రయాణానికి సరిగ్గా అరగంట ముందు రూపొందిస్తారు.

Telugu Passenger, Prepared, Railway, Ticket, Web Site-Latest News - Telugu

గతంలో ప్రయాణానికి అరగంట ముందు వరకు మాత్రమే టికెట్‌ బుకింగ్‌ అనుమతించేవారు.ఇప్పుడు రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు వరకు టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.అందుకోసం మీరు ఆన్‌లైన్‌ ఛార్ట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇందుకోసం https://www.irctc.co.in/online-charts/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రైలు నంబర్‌, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్‌ వివరాలు ఇస్తే.

మీకు అక్కడ ఒక్కో భోగీలో ఎన్ని బెర్తులు ఖాళీ ఉన్నాయో తెలుసుకోచ్చు.ఒకవేళ టికెట్లు ఉంటే.

అక్కడే బుకింగ్‌కు ఆప్షన్‌ ఉంటుంది.దీంతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube