ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన ప్రభాస్‌  

Good News For Prabhas Fans-

‘మిర్చి’ చిత్రం తర్వాత ప్రభాస్‌ నుండి వచ్చిన చిత్రాలు కేవలం రెండే.అవి బాహుబలి, బాహుబలి 2.ఈ రెండు సినిమాల తర్వాత ఈనెల చివర్లో రాబోతున్న చిత్రం ‘సాహో’.ఈ మూడు సినిమాల కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు వెయిట్‌ చేయాల్సి వచ్చింది.రెండు మూడు సంవత్సరాలుకు ఒకటి చొప్పున ప్రభాస్‌ సినిమాలు చేస్తున్నాడు.సినిమాలు అయితే బ్లాక్‌ బస్టర్స్‌ అవుతున్నాయి కాని ఆయన సినిమాల సంఖ్య మరీ తక్కువగా ఉందనే విమర్శలు వస్తున్నాయి...

Good News For Prabhas Fans--Good News For Prabhas Fans-

తాజాగా ‘సాహో’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్‌కు ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు.సాహో తర్వాత నుండి ఇకపై వరుసగా సినిమాలుంటాయని అన్నాడు.అది ఎంతగా అంటే ఖచ్చితంగా సంవత్సరంలో రెండు సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్‌ చేసుకుంటాను అంటూ ప్రకటించాడు.2020 వ సంవత్సరం నుండి ఏడాదికి రెండు సినిమాలు ఖచ్చితంగా విడుదల చేస్తానంటూ ప్రకటించాడు.ప్రస్తుతం ఈ విషయం ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగిస్తుంది.

Good News For Prabhas Fans--Good News For Prabhas Fans-

సాహో చిత్రం కోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డ ప్రభాస్‌ మరోసారి ఆ చిత్రంతో బాలీవుడ్‌ స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే.సుజీత్‌ దర్శకత్వంలో వంశీ మరియు ప్రమోద్‌లు యూవీ క్రియేషన్స్‌లో ఈ చిత్రంను దాదాపుగా 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.సాహో చిత్రం తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని ప్రభాస్‌ చేస్తున్నాడు.