పాలసీదారులకు తీపి కబురు అందించిన ఎల్ఐసీ.. ఫ్రీగా క్రెడిట్ కార్డు!

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వరంగ భీమా సంస్థ అయిన ఎల్ఐసీ ప్రజలను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను పరిచయం చేస్తోంది.ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీలో పాలసీ తీసుకునే వారికి శుభవార్త అందించింది.

 Good News For Lic Policyholders  Lice Issue Free Credit Cards Credit Card, Debi-TeluguStop.com

అలాగే ప్రస్తుతం ఎల్ఐసీలో పాలసీదారులుగా ఉన్న వారికి కూడా గుడ్ న్యూస్ అందించింది.ఎల్ఐసీ సంస్థ తాజాగా తన కస్టమర్ లేదా పాలసీ హోల్డర్, ఏజెంట్లకు ఫ్రీగా క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తామని ప్రకటించింది.

దీంతో పాలసీదారులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు అయిన ఐడీబీఐ భాగస్వామ్యంతో ఎల్ఐసీ కార్డ్స్ సర్వీసెస్ లిమిటెడ్ రూపే క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది.

ఈ క్రెడిట్ కార్డును లుమైన్ కార్డు, ఎక్లాట్ కార్డుల పేర్లతో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ లుమైన్ (Lumine), ఎక్లాట్ (Eclat) క్రెడిట్ కార్డులను ఎల్ఐసీ ఏజెంట్లు, సభ్యులు, పాలసీదారులకు ఉచితంగా పొందొచ్చు.

వీరందరూ క్రెడిట్ కార్డు కోసం జాయినింగ్ లేదా యాన్యువల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.అయితే ఇది కేవలం ఎల్ఐసీ పాలసీదారులు, సభ్యులు, ఏజెంట్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఎల్ఐసీ పాలసీ దారులకు మాత్రమే కాకుండా ఇతర ప్రజలకు కూడా ఈ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెస్తామని ఆ సంస్థ వెల్లడించింది.ఫ్రీగా క్రెడిట్ కార్డు పొందాలనుకునేవారు “ఎల్ఐసీ కార్డ్స్ డాట్ ఇన్” వెబ్‌సైట్ సందర్శించి అప్లై చేసుకుంటే సరిపోతుంది.

ఈ క్రెడిట్ కార్డు ఎల్ఐసీ పాలసీదారులకు ఉచితంగా లభించడమే కాదు అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

Telugu Credit, Debit, Idbi, Latest, Insurance, Rupay-Latest News - Telugu

ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఎల్ఐసీ ప్రీమియం పేమెంట్ చేసుకొని రెట్టింపు రివార్డ్ పాయింట్లను పొందొచ్చు.అలాగే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ పై సర్‌ఛార్జ్ రాయితీని కూడా అందుకోవచ్చు.లుమైన్ కార్డు ద్వారా ఖర్చు చేసిన ప్రతి 100 రూపాయలకి 3 డిలీట్ డిలైట్ పాయింట్లను పొంది వాటిని ఇతర లావాదేవీల్లో ఉపయోగించవచ్చు.ఈ కార్డులపై రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీ చేస్తే 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు పొందవచ్చు.అలాగే మూడు వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో ఏదైనా వస్తువు కొంటే దాన్ని ఈఎంఐలోకి మార్చుకొని సులభంగా చెల్లింపులు జరుపుకోవచ్చు.ఈ కార్డుల వ్యాలిడిటీ నాలుగేళ్లు అని ఎల్ఐసీ సంస్థ వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube