కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిళ్ల ( Electric foldable bicycles )పరిశ్రమలో అగ్రగామిగా కొనసాగుతూ వస్తున్న స్విచ్ బైక్ తాజాగా కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఎంవీ ఆటోమొబైల్స్‌ను మన హైదరాబాద్ లో ప్రారంభించడం విశేషం.సర్దార్ పటేల్ రోడ్, ఆనంద్ థియేటర్ పక్కన బేగంపేట్‌లో కంపెనీ తన కొత్త ఎక్స్‌పీరియన్ సెంటర్‌ను తాజాగా ఆవిష్కరించడం జరిగింది.స్విచ్ బైక్ అండ్ స్విచ్ మోటోకార్ప్ వ్యవస్థాపకుడు, ఎండీ రాజ్‌కుమార్ పటేల్( MD Rajkumar Patel )ఈ సందర్భంగా మాట్లాడుతూ.“దేశ ప్రజల కోసమే స్విచ్ బైక్ మరింత అందుబాటులోకి వచ్చింది.హైదరాబాద్ ఇప్పటికే మెట్రో సిటీగా ఉంది.ఈవీ మార్కెట్‌క అనువైన సదుపాయాలను ఇక్కడ ఉన్నాయి.భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా స్విచ్ ఎక్స్‌పీరియన్స్ షోరూమ్‌లను ఏర్పాటు చేస్తాం.” అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
ఈ నేపథ్యంలో వారికి తోడ్పాటు అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.ఇక స్విచ్ బైక్, స్విచ్ మోటార్ కార్ప్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు చింతన్ ఖత్రీ( Chintan Khatri ), మాట్లాడుతూ.“స్విచ్ ఎలక్ట్రిక్ సైకిల్స్‌తో మేం ప్రీమియం సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చాం.మార్కెట్‌లో ఇపుడు గణనీయమైన వాటాను సంపాదించిన తర్వాత మేం ఇప్పుడు సీఎస్ఆర్ 762 ఎలక్ట్రిక్ మోటార్ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నాం.
దీని ద్వారా ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఇకపోతే మీరు స్విచ్ ఎలక్ట్రిక్ సైకిల్స్ కోసం మీకు సమీపంలోని ఎంవీ ఆటోమొబైల్స్ డీలర్‌షిప్( MV Automobiles Dealership ) సందర్శించొచ్చు.అదికాదంటే హైదరాబాద్‌లోనే మీకు నచ్చిన ఎలక్ట్రిక్ సైకిల్ లేదా సీఎస్ఆర్ 762 చాలా తేలికగా కొనుగోలు చేయొచ్చు.ప్రజలకు ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీసులను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, హైదరాబాద్ సహా దక్షిణ భారత దేశంలో పలు ఎక్స్ పీరియెన్స్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువస్తామని స్విచ్ బైక్ పేర్కొంటోంది.