పవన్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. ఈ ఏడాది పక్కా ఉంటుందట!

పవన్ కళ్యాణ్‌ నుండి ఈ ఏడాది మరో రెండు సినిమాలు వస్తాయని అంతా ఆశించారు.కాని అసలు ఈ ఏడాది సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

 Good News For Mega Fans About Pawan Movie Releasing-TeluguStop.com

ఇప్పటికే వచ్చిన వకీల్‌ సాబ్‌ సినిమా తోనే 2021 పూర్తి అంటూ కొందరు అనుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నుండి ఈ ఏడాది మరో సినిమా వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.మలయాళం మూవీ అయప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు.

రానా తో కలిసి పవన్ చేస్తున్న ఆ సినిమా ఈ ఏడాది లోనే వస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.యూనిట్‌ సభ్యులు 2021 లోనే సినిమా విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.

 Good News For Mega Fans About Pawan Movie Releasing-పవన్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. ఈ ఏడాది పక్కా ఉంటుందట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని సినిమా షూటింగ్‌ కరోనా వల్ల నిలిచి పోయింది.పవన్‌ కళ్యాణ్‌ కూడా కరోనా బారిన పడటం వల్ల షూటింగ్‌ ఎప్పటికి ప్రారంభం అయ్యేది క్లారిటీ లేదు.

దాంతో ఈ రీమేక్ ఈ ఏడాది ఉంటుందా లేదా అనే విషయమై స్పష్టత లేకుండా ఉంది.ఇలాంటి సమయంలో దర్శకుడు సాగర్‌ చంద్ర క్లారిటీ ఇచ్చాడు.

పవన్‌ రానాలు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయ్యింది.కనుక పవన్ కాస్త సహకరిస్తే నెల రోజుల్లోనే సినిమా ను ముగించి వెంటనే రిలీజ్ చేస్తామని దర్శకుడు చెప్పాడు.

పవన్ ఆరోగ్యం విషయంలో కాస్త ఆందోళన నెలకొంది.కరోనా నుండి కోలుకున్నా కూడా పవన్‌ కళ్యాణ్ కాస్త నలతగానే ఉంటున్నాడు.అందుకే ఆయన నుండి సహకారం మరింత కాలం పట్టే అవకాశం ఉంది.

Telugu Ayyappanum Koshiyum, Corona Effect, Director Krish, Director Sagar K Chandra, Film News, Hari Hara Veera Mallu, Pawan Fans, Pawan Kalyan, Pawan Movie Release Date, Pawan Rana Movie, Rana, Tollywood-Movie

పూర్తిగా ఇంటికే పరిమితం అయిన పవన్‌ కళ్యాణ్ కొత్త గా షూటింగ్ లో ఎప్పుడు జాయిన్‌ అవుతాడు అనేది చూడాలి.ఎప్పుడు షూటింగ్‌ లో జాయిన్ అయినా కూడా పవన్ కళ్యాణ్ మొదట అభిమానులు ఆశించినట్లుగా ఈ ఏడాది విడుదల చేసేందుకు రీమేక్ లో నటించబోతున్నాడు.అదే సమయంలో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ లో కూడా జాయిన్ అవ్వబోతున్నాడు.

ఈ రెండు సినిమాలు కొద్ది తేడాతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

#DirectorSagar #Rana #PawanMovie #Corona Effect #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు