మెగా అభిమానులకు గుడ్ న్యూస్....చిరు,కొరటాల చిత్ర షూటింగ్ ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి,కొరటాల కాంబినేషన్ లో ఒక చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు గుడ్ న్యూస్.

 Good News For Mega Fans-TeluguStop.com

ఈ చిత్రం కి సంబందించిన తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరు పుట్టిన రోజు అయినా ఆగష్టు 22 వ తేదీన కొరటాల సినిమా ప్రారంభికానున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం చిరు ‘సైరా’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం తో ఈ చిత్రం ఎప్ప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అన్న అనుమానం వ్యక్తం అయ్యింది.

అయితే మరోకొద్దీ రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్న నేపథ్యంలో చిరు,కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్ర ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది.సైరా షూటింగ్ ముగియగానే చిరు కొద్దీ రోజులు రెస్ట్ తీసుకున్న తరువాత కొరటాల డైరెక్షన్ లో చిరు చిత్రం ప్రారంభంకానుంది.

మెగాస్టార్ కోసం కొరటాల అదిరిపోయే స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేశారట.ఇక ఎలాగో ఈ చిత్ర షూటింగ్ ఆగస్టు లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకా రెండు నెలల సమయం ఉన్నది కాబట్టి కొరటాల స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దే పనిలో పడ్డారట.

మెగా అభిమానులకు గుడ్ న్యూస్�

రైతుల సమస్యలకు సంబంధించిన అంశంతో కథను రెడీ చేశారని టాక్.ఇందులో మెగాస్టార్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు.ఒకటి రైతు పాత్రకాగా, రెండోది ఎన్ఆర్ఐ పాత్ర.రైతు పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నది.మహర్షి సినిమా మాదిరి రైతుల సమస్యల గురించి కొద్దిగా చూపించి వదిలేయకుండా.ఆ సమస్యలను డీప్ గా చూపించబోతున్నారు.

సెంటిమెంట్, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం.మరి ఈ చిత్ర విశేషాలు మరిన్ని తెలియాలి అంటే ఇంకా రెండు నెలలు ఆగాల్సిందే అన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube