మందుబాబులకు గుడ్ న్యూస్.. అక్కడ ఆన్‌లైన్‌ లో మద్యం అమ్మకాలు..!

కరోనా మనదేశంలో అనేక నష్టాలను కలిగించింది.చాలా సంస్థలు తీవ్ర నష్టాలను పొందాయి.

 Good News For Mandubabs .. There Are Liquor Sales Online  Good News, Liquers, On-TeluguStop.com

లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇంటికే పరిమితం అవ్వడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులనేవి తలెత్తాయి.అయితే ఇటువంటి సమయంలో కూడా మద్యం అమ్మకాలు సజావుగానే సాగాయి.

చాలామంది మద్యం కోసం క్యూ కట్టిన సందర్భాలున్నాయి.మద్యం దొరక్క ప్రాణాలొదిలిన ఘటనలు ఎన్నో లాక్ డౌన్ లో చోటుచేసుకున్నాయి.

అందుకే ఆయా ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను మాత్రం నిలపడం లేదు.చాలా మంది ప్రభుత్వాలకు తన గోడును విన్నవించుకున్నారు.

మద్యం అమ్మకాలు ఆపవద్దని బతిమలాడుకున్నారు.అందుకే కొన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాలను ఆన్ లైన్ లో కూడా జరిపారు.

తాజాగా మరో రాష్ట్రం కూడా ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలను జరిపేందుకు సిద్దమయ్యింది.ఆన్‌లైన్‌ లో మద్యం అమ్మేందుకు అస్సాం కేబినెట్ ఆమోదం తెలిపడంతో ఆన్ లైన్ అమ్మకాలు షురూ అయ్యాయి.

గువాహటిలో కేబినెట్ సమావేశం జరిగింది.అందులో ప్రయోగాత్మకంగా ఓ నెల రోజుల పాటు ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.బుధవారం అస్సాం మంత్రి పీజుష్ హజారిక ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు.గువాహటిలో నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఆన్ లైన్ లో మద్యాన్ని అమ్ముతున్నట్లు అస్సాం కేబినెట్ నిర్ణయించింది.

Telugu Liquers, Meida, Latest-Latest News - Telugu

ఇది కనుక విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని సర్కార్ తెలిపింది.ఈ మేరకు సీఎం హిమంత విశ్వ శర్మ ట్విట్టర్ లో ఓ పోస్టు ను పెట్టాడు.అస్సాం కేబినెట్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకున్నట్లు తెలియజేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు రిలీఫ్ అందించడంతో పాటు విద్యను వృద్ధి చేయాలనుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు.

మద్యం అమ్మకాలు ఆన్ లైన్ నిర్వహించడం పట్ల మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube