James Bond ప్రేమికులకు శుభవార్త... అమెజాన్‌ ప్రైమ్‌లో 25 జేమ్స్ బాండ్‌ చిత్రాలు!

James Bond అనగానే అందరి మదిలోకి ఒక రూపం వచ్చేస్తుంది.అంతలాగ భాష, వయసుతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా James Bond అనే హాలీవుడ్ సినిమా విశేష ఆదరణ పొందింది.

 Good News For James Bond Lovers 25 James Bond Movies On Amazon Prime-TeluguStop.com

కాగా తొలి జేమ్స్‌బాండ్‌ వెండితెరకు పరిచయమై 60ఏళ్లు పూర్తయ్యాయి.ఈ సందర్భంగా ప్రముఖ OTT వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో బాండ్‌ అభిమానుల కోసం ఓ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది.1962లో ‘డాక్టర్‌ నో’తో మొదలైన బాండ్‌ సిరీస్‌లో ఇప్పటివరకూ 25 చిత్రాలుదాకా వచ్చాయి.

అయితే, ఇప్పుడు ఈ 25 చిత్రాలను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రక్షకులకోసం అందుబాటులోకి తెచ్చింది.

ఇండియా, US, UK, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్‌, మెక్సికో, స్పెయిన్‌, సౌత్‌ ఈస్ట్‌ ఏషియా ప్రాంత వాసులు వీటిని వీక్షించవచ్చు.అయితే, ఇది ఈ అవకాశం కొద్దిరోజులు మాత్రమే కల్పించనున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తెలపడం గమనార్హం.

కాబట్టి మిత్రులారా ఈ దసరా సెలవుల్లో నచ్చిన బాండ్‌ సినిమాలను వరుసగా చూసేయండి మరి! ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.

James Bond మూవీస్ లిస్ట్:

1.డాక్టర్‌ నో (1962), 2.ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌ (1963), 3.గోల్డ్‌ ఫింగర్‌ (1964), 4.థండర్‌ బాల్‌ (1965), 5.యు ఓన్లీ లివ్‌ ట్వైస్‌ (1967), 6.ఆన్‌ హర్‌ మెజస్ట్రీ సీక్రెట్‌ సర్వీస్‌ (1969), 7.డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌ (1971), 8.లివ్‌ అండ్‌ లెట్‌ డై (1973), 9.ది మ్యాన్‌ విత్‌ గోల్డెన్‌ గన్‌ (1974), 10.ది స్పై హూ లవ్డ్‌ మి (1977), 11.మూన్‌రేకర్‌ (1979), 12.ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ (1981), 13.ఆక్టోపస్సీ (1983), 14.ఎ వ్యూ టు ఎ కిల్‌ (1985), 15.ది లివింగ్‌ డేలైట్స్‌ (1987), 16.గోల్డెన్‌ ఐ (1995), 17.టుమారో నెవ్వర్‌ డైస్‌ (1997), 18.ది వరల్డ్‌ ఈజ్‌ నాట్‌ ఇనఫ్‌ (1999), 19.డై అనదర్‌ డే (2002), 20.క్యాసినో రాయల్‌ (2006), 21.క్వాంటమ్‌ ఆఫ్‌ సొలెస్‌ (2008), 22.స్కైఫాల్‌ (2012), 23.స్పెక్టార్‌ (2015), 24.నో టైమ్‌ టు డై(2021)

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube