ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్‌కి గుడ్‌న్యూస్... వీడియోలను రీల్స్‌గా మార్చే నయా ఫీచర్!

ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ గత కొద్ది నెలలుగా వరుసగా అదిరిపోయే ఫీచర్లను లాంచ్ చేస్తోంది.ఇప్పటికే కంటెంట్ క్రియేటర్ల కోసం ఎంతో ఉపయోగకరమైన ఫీచర్లను కూడా లాంచ్ చేసింది.

 Good News For Instagram Users A New Feature That Turns Videos Into Reels Instagr-TeluguStop.com

తాజాగా మరొక ఫీచర్ తీసుకు వచ్చే పనిలో పడింది ఇన్‌స్టాగ్రామ్.అదే వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా మార్చే ఫీచర్‌.

ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు రకరకాల వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు.అయితే త్వరలో వీడియోలను నేరుగా రీల్స్‌గా తయారు చేసుకోవడం సాధ్యమవుతుంది.

ప్రస్తుతానికి ఇన్‌స్టాగ్రామ్‌ ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది.కొద్ది రోజుల్లోనే రెగ్యులర్ యూజర్లందరికీ లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఈ ఫీచర్‌తో యూజర్లు పబ్లిక్‌గా అప్‌లోడ్‌ అయిన వీడియోని రీల్స్‌గా మార్చినప్పుడు ఆ రీల్స్‌లోని ఆడియో, వీడియో క్లిప్‌లను ఇతర యూజర్లు యూజ్ చేయవచ్చు.సాధారణంగా రీల్స్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఎడిటింగ్ టూల్స్‌, రకరకాల ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఎఫెక్ట్స్, వాయిస్ ఓవర్, యాడ్ టెక్స్ట్ వంటివి అందుబాటులో ఉంటాయి.

అయితే నయా ఫీచర్‌తో వీడియో క్రియేట్ చేస్తున్న కూడా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి.అప్పుడు వీడియోలను మీరు ఈజీగా రీల్స్‌గా మార్చుకోవచ్చు.

Telugu Delete, Reels, Vidoes-Latest News - Telugu

వీడియో పోస్టులు కూడా రీల్స్ మాదిరి ఆకర్షణీయంగా ఉంటే యూజర్స్‌ మరింత ఎంజాయ్ చేయగలుగుతారని ఇన్‌స్టాగ్రామ్ పేర్కొంది.ఒక టెక్‌ ఎక్స్‌పర్ట్ దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ కూడా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.ఇప్పుడది వైరల్ గా మారింది.టిక్‌టాక్ వంటి వీడియో షేరింగ్ దిగ్గజాలకు పోటీగా నిలిచేందుకు ఇన్‌స్టా కూడా అదిరిపోయే ఫీచర్లను పరిచయం చేస్తోంది.60 సెకండ్ల స్టోరీస్, పోస్ట్స్ పిన్నింగ్, కొత్త ట్యాగ్స్‌ వంటి ఎన్నో ఫీచర్లను ఈ ఏడాది ఇన్‌స్టాగ్రామ్ పరిచయం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube