భారతీయులకు గుడ్ న్యూస్..మరో కీలక నిర్ణయం తీసుకున్న బిడెన్..!!!

అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పరిపాలనపై వేగంగా పట్టుపెంచుకుంటూనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.మాజీ అధ్యక్షుడు ట్రంప్ తలతిక్క నిర్ణయాల కారణంగా అమెరికా పరువు పోవడమే కాకుండా అన్ని దేశాల ముందు చులకన అయ్యామని ఈ మచ్చను తొలగించి మళ్ళీ అమెరికా సత్తా చాటుతానని ఎన్నికల ప్రచార సమయంలో బిడెన్ ఎన్నో సార్లు ప్రకటించారు.

 Good News For Indians Biden Has Taken Another Crucial Decision , Trump, Biden, I-TeluguStop.com

ఇప్పుడు ఈ దిశగానే బిడెన్ అడుగులు వేస్తున్నారు.అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బిడెన్ అమెరికా వచ్చే వలస వాసుల నిభంధనలపై దృష్టి సారించారు.

ట్రంప్ తీసుకున్న కటినమైన ఇమ్మిగ్రేషన్ నిభంధనలను తొక్కి పెట్టారు.గతంలో ఎలాగైతే నిభందనలు ఉండేవో వాటినే అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలోనే అర్హులైన అభ్యర్ధులు ఎవరైనా అమెరికాకు సేవలకు అందించేందుకు వారికి అమెరికాలో ఎంట్రీ కి నిభందనలు సడలించారు.ఈ మేరకు గతంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ పరీక్షను రద్దు చేశారు.

2008 లో అమెరికా ఎలాంటి నిభందనలు అనుసరించిందో అలాంటి నిభందనలు ప్రస్తుతం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Telugu America, Biden, Indinas, Trump-Telugu NRI

పాత నిభందన ప్రకారం అమెరికా పౌరులు కావాలనుకునే వారు ఎవరైనా సరే ఇంగ్లీష్ ను అర్ధం చేసుకుని సివిక్స్ పరీక్షలో పాస్ అయితే చాలని తెలిపారు.ఇప్పటికే ఈ నిభంధనపై అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ ప్రకటన జారీ చేసింది.ట్రంప్ పద్దతిని రద్దు చేశామని, ఇప్పుడు కొత్త పద్దతిని అందరూ అనుసరించవచ్చని ప్రకటిచింది.

ఇదిలాఉంటే ఇప్పటి వరకూ కొత్త పద్దతిలో అప్ప్లై చేసుకున్న వారు , సదరు పరీక్షకు సంనద్దమైన వారు ట్రంప్ పద్దతిలో పరీక్ష రాయవచ్చని తెలిపింది. మార్చి 1 -2020 తరువాత దరఖాస్తు చేసుకున్న వారికి పాత పద్దతిలో పరీక్షలు ఉంటాయని పేర్కొంది.

కాగా ఈ విధానం వలన 2008 లో భారతీయులే ఎక్కువగా లాభ పడ్డారని, ఇప్పుడు కూడా భారతీయులకు లబ్ది చేకూరుతుందని అంటున్నారు నిపుణులు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube