ఇండియన్ టెక్కిలకు తియ్యటి వార్త.. ఆ తేదీ నుంచే హెచ్1బీ అప్లికేషన్ల స్వీకరణ!

ఇండియన్ టెక్కిలకు యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తీపి కబురు అందించింది.2023-24 హెచ్1బీ వీసాల కోసం ప్రారంభ రిజిస్ట్రేషన్‌ను మార్చి 1 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపింది.ఈ రిజిస్ట్రేషన్ల సమయం ఈ ఏడాది మార్చి 17 వరకు కొనసాగుతుంది.ఈ సమయంలో దరఖాస్తుదారులు ఆన్‌లైన్ H-1B రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ని ఉపయోగించి రిజిస్ట్రేషన్లను పూర్తి చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

 Good News For Indian Techies Us To Start Receiving H1b Visa Applications From Ma-TeluguStop.com

కాగా మార్చి 31వ తేదీ నాటికి వీసా హోల్డర్ల పేర్లను యూఎస్ ప్రభుత్వం ప్రకటించనుంది.

Telugu America, America Nris, Hb Visa, India, Indian, Usa, Usa Citizenship, Visa

యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ ఫిబ్రవరి 21న H-1B వీసాల కోసం 10 డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజులను తీసుకోవడం ప్రారంభిస్తుంది.తగినంత రిజిస్ట్రేషన్లు వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ కొన్నింటిని ఎంచుకుని మార్చి 31 నాటికి నోటిఫికేషన్లను పంపిస్తుంది.H-1B వీసాలు టాలెంటెడ్ టెక్ వర్కర్స్‌ను యూఎస్‌కి తీసుకురావడానికి అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు ఉపయోగిస్తాయి.ఈ వీసాలు ఎక్కువగా చైనీయులు, భారతీయులకే అందుతున్నాయి.

Telugu America, America Nris, Hb Visa, India, Indian, Usa, Usa Citizenship, Visa

సాంకేతికత, ఇంజనీరింగ్, వైద్యం వంటి ప్రత్యేక రంగాలలో యూఎస్‌లో ఆరు సంవత్సరాల వరకు పని చేయడానికి జీవించడానికి H-1B వీసాలు అనుమతిస్తాయి.ఆరు సంవత్సరాల తర్వాత, ఇది శాశ్వత నివాసం లేదా గ్రీన్ కార్డ్‌కు మార్గాలను తెరుస్తుంది.కాగా యూఎస్‌లో ఇటీవల టెక్ తొలగింపులు ఈ సంవత్సరం H-1B వీసాల డిమాండ్‌ను ప్రభావితం చేస్తాయో లేదో తెలియాల్సి ఉంది.

బాగా ప్రతిభ ఉండి ఇండియాలో జాబ్ దొరకకపోతే అమెరికన్ కంపెనీల్లో జాబు పొందడం అలాగే అక్కడ జీవితం కొనసాగించడం ఈ వీసా తో సాధ్యమవుతుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube