HDFC Bank కస్టమర్లకు శుభవార్త... అరగంటలోనే లోన్ తీసుకోండి ఇక!

దసరా పండుగ నేపథ్యంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ సంస్థలు భారీ ఎత్తున ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.ఈ నేపథ్యంలో కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలి అని మనవి చేసుకుంటున్నాయి.

 Good News For Hdfc Bank Customers-TeluguStop.com

ఈ క్రమంలో దిగ్గజ బ్యాంక్ HDFC బ్యాంక్ తన వినియోగదారులకు వివిధ రకాల సర్వీసులను అందిస్తుంది.పండుగ సందర్భంగా కస్టమర్లకు వివిధ రకాల ఆఫర్లు అందుబాటులో ఉంచింది ఈ బ్యాంక్.

ఆన్లైన్, ఆఫ్లైన్ డిస్కౌంట్లతో పాటుగా లోన్లపై కూడా భారీ తగ్గింపు అందిస్తుంది.బిజినెస్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్స్, హోమ్ లోన్స్ వంటి వాటిపై స్పెషల్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది.

ఇకపోతే ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.పర్సనల్ లోన్ పొందాలనుకునేవారు 40 లక్షల వరకు లోన్ పొందే అవకాశం కలదు.వడ్డీ రేటు 10.5% నుంచి ప్రారంభం అవుతుంది.అలాగే బిజినెస్ లోన్ పొందాలంటే ఎటువంటి తనిఖీ లేకుండా రుణాలు ఇస్తోంది.అలాగే ప్రాసెసింగ్ ఫీజులో 50% తగ్గింపు అందుబాటులో ఉంచింది.అలాగే కార్ లోన్స్ పొందాలనుకుంటే కేవలం 30 నిమిషాల్లోనే రుణం పొందవచ్చు అని బ్యాంక్ తెలిపింది.వడ్డీ రేటు 7.9 శాతం నుంచి మొదలవుతుంది.అలాగే ఎలాంటి చార్జీలు ఉండవు.

కారు, హోమ్, గోల్డ్ లోన్స్ పై భారీ ఆఫర్లు అందిస్తుంది HDFC బ్యాంక్.50 లక్షల వరకు రుణాలను తక్కువ వడ్డీ రేటు కే పొందవచ్చు అని బ్యాంక్ తెలిపింది.అలాగే ప్రాపర్టీ మీద లోన్ తీసుకునే వారికి ఫ్లాట్ రూ.9999 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కు స్పెషల్ ప్రాసెసింగ్ బెనిఫిట్ పొందవచ్చు.బ్యాంక్ పలు రకాల బ్రాండ్లతో పార్టనర్ షిప్ కుదుర్చుకుంది.కస్టమర్లకు వివిధ ఆఫర్లు అందుబాటులో ఉంచింది.ఫెస్టివల్ లో భాగంగా ఇతర బ్యాంకులు కూడా పండుగ ఆఫర్లు తీసుకొచ్చాయి.

ICICI బ్యాంక్, SBI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి కస్టమర్లకు కొన్ని రకాల బెనిఫిట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube