హెచ్-4 వీసా ప్రస్తుతానికి ఊరట..!!!

హెచ్ -4 వీసా దారుల అనుమతులు రద్దు చేయాలనే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇంకా ఈ విషయంలో చర్చలు జరగలేదని సంభందిత అధికారులు తెలిపారు.ఈ విషయంలో నిభంధనల అమలు ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని అన్నారు.

తుది నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని తేల్చి చెప్పారు.దాంతో హెచ్-4 వీసా దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్-4 వీసా ప్రస్తుతానికి ఊరట!

హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వాములకి ఇచ్చేదే హెచ్-4 వీసా.ఈ వీసాతో పాటు అమెరికా పౌరసత్వం, వలస దారుల నిభందనలు వంటి పలు అంశాలపై చర్చించవలసిన అవసరం ఉందని హోం సెక్యూరిటీ తెలిపింది.ప్రతిభ ఉన్న వారికే అమెరికాలో స్థానం కల్పించాలని, వారికే అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపిన విషయం విధితమే.హెచ్-4 పని అనుమతులు వలన అమెరికన్లు భారీగా నష్ట పోతున్నారని అందుకు తగ్గట్టుగా సవరణలు చేయడం కోసమే ఈ బిల్లు అని ట్రంప్ సర్కార్ వాదిస్తోంది.అయితే

హెచ్‌-1బీ వీసా ద్వారా అమెరికా ఆర్ధిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వారి కుటుంబాల ఆర్ధిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారి విషయంలో ఈ హెచ్-4 వీసాని ప్రవేశ పెట్టిందని పలువురు గుర్తు చేస్తున్నారు ట్రంప్ సర్కార్ కి.ఒక వేళ హెచ్ -4 వీసాపై ట్రంప్ సర్కార్ తమ నిర్ణయాన్ని అమలు చేస్తే మాత్రం అమెరికా ఆర్ధిక పరిస్థితి పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube