గూగుల్ వినియోగదారులకు శుభవార్త... అన్ని ఫోన్లలోను మ్యాజిక్ ఎరేజర్ వెసులుబాటు!

గూగుల్ వాడే ఎడిటర్లకు ఓ శుభవార్త.ఇప్పుడు మ్యాజిక్ ఎరేజర్ ఐఓఎస్‌తో సహా అన్ని ఫోన్లకు అందుబాటులో ఉందని తాజాగా గూగుల్ ప్రకటించింది.

గూగుల్ అందించిన సమాచారం ప్రకారం, మ్యాజిక్ ఎరేజర్ మొదటిసారిగా 2021లో పిక్సెల్ 6, 6 ప్రోలో కనిపించింది.తర్వాత పిక్సెల్ 7 సిరీస్‌లు అందుబాటులోకి రావడంతో అందులో కూడా ఈ ఫీచర్ బాగా వాడబడింది.

ఈ మ్యాజిక్ ఎరేజర్ వల్ల ఫోటోలలో మనకు అవసరం లేని వాటిని చాలా సులభంగా తొలగించవచ్చనే విషయం మీకు తెలిసిందే.

ఈ మ్యాజిక్ ఎరేజర్ సహాయంతో ఫోటోలలో అవసరం లేని ప్రదేశాన్ని సర్కిల్ చేసి వాటిని తేలికగా తొలగించవచ్చు.గూగుల్ అందించిన ఈ మ్యాజిక్ ఎరేజర్లు ఇప్పటికే సామ్ సంగ్ కి చెందిన అన్ని ఫోన్ల తో పాటు ఐఫోన్, ఐపాడ్, గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్‌లో అందుబాటులో ఉందనే విషయం మీకు తెలిసిందే.ఇక ఇటీవల , గూగుల్ తన నోట్-టేకింగ్ సర్వీస్ ‘గూగుల్ కీప్’లో కొత్త ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

ఇది యూజర్లు ఆండ్రాయిడ్ పరికరాలలో వారి హోమ్ స్క్రీన్‌కు గమనిక లేదా జాబితాను పిన్ చేయడానికి అనుమతిస్తుంది.

ఫోటోగ్రఫీ హాబీగా వున్నవారికి ఇది బాగా ఉపకరిస్తుంది.మీరు ఒక ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు బాక్గ్రౌండ్లో వున్న అనవసరమైన స్టఫ్ ని తేలికగా తొలగించుకోవచ్చు.ఇంకా ఇది ఫోటోలోని మచ్చలు, అనవసరమైన థింగ్స్ ని తొలగించడానికి, ఎంతో ఉపయోగపడుతుంది.

అలాగే మీ ఫోటోల నుంచి అవసరం లేని వ్యక్తులను కూడా సులభంగా తీసివేయవచ్చు.అలాగే ఫోటోలపై ముద్రించిన తేదీ, టెక్స్ట్, లోగోలు, సంతకాలను కూడా ఎరేజ్ చేయవచ్చు.

వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..
Advertisement

తాజా వార్తలు