పసిడి ప్రియులకు శుభవార్త: తగ్గిన బంగారం ధరలు.. ఈ వారం ధరలు ఇలా..!

బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుతూనే వస్తున్నాయి.దీంతో ప్రజలకు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

 Good News For Gold Lovers Reduced Gold Prices This Weeks Prices Are Like This  G-TeluguStop.com

సురక్షితమైన పెట్టుబడుల పెట్టాలంటే ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది బంగారం అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.అయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర విపరీతంగా పడిపోతున్న నేపథ్యంలో ప్రజలు బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని చెప్పుకోవచ్చు.

ఈరోజు ఆదివారం కాబట్టి ట్రేడింగ్ జరగదు కావున ఆగస్టు 24 నుండి ఆగస్టు 29వ తేదీ వరకు బంగారం ధరలు ఎలా మారుతూ వచ్చాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఆగస్టు 24 అనగా సోమవారం నుండి వరుసగా అనగా బుధవారం వరకు ప్రతి రోజు బంగారం ధరలు తగ్గుతూనే వచ్చాయి.

సోమవారం రోజు పది గ్రాముల బంగారం ధర 490 రూపాయలు తగ్గింది.సోమ మంగళ బుధవారాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1, 410 రూపాయలు తగ్గింది.

కానీ గురువారం రోజు ఒక్కనాడే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 690 పెరిగింది.మళ్లీ శుక్రవారం రోజు బంగారం ధర నిలకడగా ఉండగా. శనివారం రోజు 140 రూపాయలు తగ్గింది.

ఈ వారం మొత్తంలో 10 గ్రాముల 22, 24 క్యారెట్ల ధరలు తెలుసుకుంటే… 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1370 తగ్గి ప్రస్తుతం 49,120 వద్ద నిలిచింది.10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1490 తగ్గి రూ.53, 580 వద్ద నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube