Central govt balika samriddhi yojana : అమ్మాయిలకు కేంద్రం శుభవార్త... ఇక మీ చదువుకి అడ్డంకేదీకాదు!

కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెడుతోంది.ఇక్కడ ప్రతి పనీ కూడా డబ్బుల మీద ఆధారపడి జరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసినదే.

 Good News For Girls... No More Hindrance To Your Studies! , Girls ,  Studies, Ce-TeluguStop.com

ఏ చిన్న పని చేయాలన్నా కూడా ఇప్పుడు డబ్బులు తప్పనిసరి.మరీ ముఖ్యంగా విద్య, వైద్యం అనేది డబ్బులు లేకపోతే కుదరని పనికాదు.

ప్రతిరోజూ అనేకమంది డబ్బులులేక సరియైన వైద్యం అందక మరణిస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? అలాగే సరిపడా డబ్బులు లేక చదవాలనుకున్న చదువులు చదవలేక అవస్థలు పడినవారు ఎందరో వున్నారు.అందులో మీరు కూడా ఉండొచ్చు.

ఇక దేశంలో డబ్బులు లేక చదువుకోలేని చిన్నారులు అనేకమంది వున్నారు.వీరు చదువులో ముందున్నప్పటికీ డబ్బు లేని కారణంగా చదువుకోలేకపోతున్నారు.అయితే దానికోసం కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ ని ప్రవేశ పెట్టింది.ఈ పథకంతో డబ్బులు కట్టకుండానే బాలికలను ఉచితంగా చదువుకోవచ్చని మీకు తెలుసా? అవును, వారి విద్యకు అయ్యే ఖర్చును మొత్తం ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.బాలికల భవిష్యత్తు కోసం బాలికా సమృద్ధి యోజన పథకాన్ని 1997 అక్టోబర్ 2న, అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది.

Telugu Balikasamriddhi, Poverty Line, Central, Modi, Scholarship-Latest News - T

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలలోని బాలికలకు ఈ పధకం వర్తిస్తుంది.ఇక్కడ కొన్ని నియమనిబంధనలు అనేవి వున్నాయి.15 ఆగస్టు 1997 తర్వాత పుట్టిన ఆడపిల్లలు మాత్రమే బాలికా సమృద్ధి యోజన పథకానికి అర్హులని గుర్తు పెట్టుకోవాలి.ఇక్కడ గుర్తించుకోవలసిన మరో విషయం ఏమంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు వున్నా సరే, వారిద్దరూ ఈ పథకానికి అర్హులే.ప్రతి ఏటా వారి చదువు కోసం స్కాలర్ఫిప్ ను కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.

అయితే ఈ పథకంలోని బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండానే వివాహం చేస్తే వారు ఇలాంటి ప్రయోజనాలు పొందడానికి అనర్హులు అవుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube