గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌..!

ప్రస్తుత తరుణంలో తినే తిండి దగ్గర నుండి కట్టుకునే బట్ట వరకూ ఏదైనా ఆర్డర్ చేస్తే చాలు.నిమిషాల్లో మన ఇంటికొస్తున్నాయి.

 Good News For Gas Cylinder Customers, Gas Cylinder, Good News, 2hours, Central Government, Latest News-TeluguStop.com

ఇలా అన్ని వేగం పుంజుకోగా.కొన్ని ప్రభుత్వ పరమైన సేవలు ఎన్నో ఏళ్లుగా ఇంకా నిధానంగానే ఉన్నాయి.

టెలిఫోన్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ వంటి సౌకర్యలను వినియోగదారులు అర్జీ పెట్టుకున్న గంటల వ్యవధిలోనే సేవలు అందిస్తుండగా.తాజాగా వంట గ్యాస్ సిలిండర్ కూడా ఈ జాబితాలో చేరింది.

 Good News For Gas Cylinder Customers, Gas Cylinder, Good News, 2hours, Central Government, Latest News-గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక్క సిలిండర్‌తో అష్టకష్టాలు పడుతున్న ఇండేన్ గ్యాస్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తత్కాల్ సేవ సౌకర్యాన్ని ప్రారంభించినట్టు ఇండేన్ గ్యాస్ సంస్థ తెలిపింది.

ఇందులో భాగంగా సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు రెండు గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతుందని ప్రకటించింది.

ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన ఐవీఆర్ఎస్, వెబ్‌సైట్ లేదా ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా కస్టమర్లు సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.గ్యాస్ బుక్ చేసుకున్న కేవలం రెండు గంటల్లోనే వినియోగదారులు సిలిండర్ పొందవచ్చని అయితే దీని కోసం కస్టమర్లు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.ఫోన్, ఇండేన్ ఆయిల్‌వన్ యాప్, ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చన్నారు.

హైదరాబాద్‌లో మొత్తం 62 ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.

మరోవైపు ఇటీవల ఇండేన్ గ్యాస్ సంస్థ కాంపోజిట్ సిలిండర్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

తక్కువ ధరకే ఈ సిలిండర్‌ను ఇండేన్ గ్యాస్ సంస్థ అందిస్తోంది.అయితే ఇది మాములు సిలిండర్‌ కంటే కొంచెం తక్కువ బరువు కలిగి ఉంటుంది.

దీనిపై ప్లాస్టిక్ తొడుగు ఉండటంతో మిగిలిన సిలిండర్ల తరహాలో తుప్పు పట్టే అవకాశం ఉండదు.ఒక రకంగా ఇది వినియోగదారులకు శుభవార్త అనే చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube