ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. రూ.200 కోట్లు జమ

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లోకి రూ.200 కోట్లను సీఎం జగన్ జమ చేశారు.రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఏపీ సీఎం జగన్ అన్నారు.

 Good News For Farmers In Ap.. Rs. 200 Crores Deposited-TeluguStop.com

రైతులకు మూడేళ్లుగా ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు.ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగింపు ముందే పరిహారం అందించినట్టు తెలిపారు.

క్రాప్ ఇన్సూరెన్స్ మరో ఏడాది రాకముందే ఇస్తున్నామన్నారు.వ్యవసాయ రంగంలో చాలా మార్పులు తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు.

జులై -అక్టోబర్ లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తున్నామని వెల్లడించారు.ఇప్పటివరకు రూ.1834 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చామని తెలిపారు.

వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణం ద్వారా రైతులకు భరోసా కల్పించినట్లు సీఎం జగన్ తెలిపారు.8,22,411 మంది రైతులకు రూ.160.55 కోట్లు వడ్డీ రాయితీ ఇచ్చారు.అనంతరం చంద్రబాబు హయాంలో బకాయిలను ఎగ్గొట్టారని విమర్శించారు.

చంద్రబాబు పాలనకు, వైసీపీ పాలనకు వ్యత్యాసముందని పేర్కొన్నారు.క్రమం తప్పకుండా రైతులకు వడ్డీ రాయితీలకు ఇస్తున్నామన్నారు.రైతు భరోసా సాయం రూ.25,971 కోట్లు ఇచ్చామన్నారు.చంద్రబాబు రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేశారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube