కువైట్ లోని ప్రవాసులకు గుడ్ న్యూస్...రెసిడెన్సీ రెన్యువల్ పై కీలక ప్రకటన

కువైట్ దేశానికి వివిధ దేశాలనుంచే ఎంతో మంది వలసలు వెళ్తూ ఉంటారు.వారిలో అధిక శాతం మంది కార్మికులుగా, పలు రంగాలలో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు.

 Good News For Expatriates In Kuwait Key Announcement On Residency Renewal-TeluguStop.com

అయితే కరోనా నేపధ్యంలో ఎంతో మంది ప్రవాసులు కువైట్ విడిచి ఆయా దేశాలకు వెళ్ళిపోయారు.అలా వెళ్ళిన వారిలో చాలామంది కువైట్ ఇచ్చే రెసిడెన్సీ ను రెన్యువల్ చేయడం మరిచిపోవడమే లేదంటే ఏ ఇతరాత్రా కారణాల దృష్ట్యా రెన్యువల్ చేయకపోవడమో జరిగింది.

ఈ నేపధ్యంలో రెసిడెన్సీ రెన్యువల్ చేయని వారికి రెండవ సారి అవకాశం ఇచ్చిది అక్కడి ప్రభుత్వం.

 Good News For Expatriates In Kuwait Key Announcement On Residency Renewal-కువైట్ లోని ప్రవాసులకు గుడ్ న్యూస్…రెసిడెన్సీ రెన్యువల్ పై కీలక ప్రకటన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోనటువంటి ప్రవాసులు ఉండటంతో మరొక్క సారి రెసిడెన్సి రెన్యువల్ కు అవకాశం ఇచ్చారు కువైట్ దేశపు అంతర్గతపు వవహారాల మంత్రి షేక్ దామోర్ అల్ అలీ.

గడువు ముగిసినా తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారు లేదంటే గడువు ముగిసినా తమ దేశాలలో ఉంటున్న ప్రవాసులు తప్పకుండా ఈ నెల 15 (ఏప్రియల్ 15) తో ముగిసిన తేదీని మే నెల 15 వరకూ పెంచుతున్నట్టుగా ప్రకటించారు.అంతేకాదు అల్ అలీ మరొక ప్రకటన కూడా చేశారు.

మే 15 వరకూ సమయాన్ని ఇచ్చాము ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా తమ చట్టాలను ఉల్లంఘిస్తూ రెసిడెన్సీ రెన్యువల్ చేసుకొని వారిపై కటినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.అలాంటి వారిపై దేశం నుంచీ బహిష్కరణ, వారి పర్మిట్లు రద్దు చేయడం, భారీ జరిమానా తో పాటు ఎప్పటికి కువైట్ లోకి అనుమతించకుండా చేస్తామని తెలిపారు.

ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలంటే రెసిడెన్సీ అయిన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని కోరారు.

#SheikhDamor #Kuwait

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు