మందుబాబులకు గుడ్ న్యూస్.. అందుబాటులో 400 ఏళ్ల నాటి బీర్..

ప్రపంచంలో మద్యంలో ఎక్కువ మంది ఇష్టపడేది బీర్.ఏదైన చిన్న అకేషన్ ఉంటే చాలా బీర్ కావాల్సిందే.

 Good News For Drug Addicts  400 Year Old Beer Available , Good News, Liquor, 40-TeluguStop.com

సాధారణంగా బీర్ ని మాల్ట్ సెరల్స్, హాప్స్, ఈస్ట్ మరియు వాటర్ వంటి సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేస్తారు.ఫెర్మెంటేషన్ కి వాడే ఈస్ట్ లోని రకాలను బట్టి బీర్ టేస్ట్ వివిధ రకాలుగా ఉంటుంది.

అందుకే బీర్ టేస్టే డిఫెరెంట్ గా ఉంటుంది.కొత్తదనాన్ని ఆస్వాదించే మందుబాబులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

దాదాపు 400 సంవత్సరాల క్రితం నాటి బీర్ అందుబాటులోకి రానుంది.అవును నిజమే.

ఒక దశాబ్దం పరిశోధన, ఎన్నో పరీక్షల ఫలితంగా ఈక్వెడార్ బయో ఇంజనీర్ జేవియర్ కార్వాజల్ 400 సంవత్సరాల క్రితం నాటి బీర్ ని తిరిగి సృష్టించారు.

లాటిన్ అమెరికాలోనే పురాతనమైన ఈ బీర్ ని దాని ఈస్ట్ నుంచి మళ్లీ సృష్టించాడు.

పాత ఓక్ బారెల్ లోపల ఈస్ట్ నమూనాను కార్వాజల్ కనుగొన్నాడు.స్పెషలిస్ట్ బీర్ మ్యాగజైన్ చదువుతున్న సమయంలో క్విటోలోని పురాతన ఫ్రాన్సిస్కాన్ బ్రూవరీ గురించి కార్వాజల్ తెలుసుకున్నాడు.

ఆ తర్వాత దాని కోసం తీవ్రంగా కృషి చేశాడు.చివరికి ఏడాది తర్వాత 2008లో పాత బ్రూవరీ నుంచి ఒక బారెల్ ను కొని దీన్ని తయారు చేశాడు.

దీనికోసం ఏక కణ సూక్ష్మజీవిని కేవలం ఒక చెక్క ముక్క నుంచి తీసుకున్నాడు.

నిజానికి ఈక్వెడార్ రాజధానిగా ఉన్న ప్రాంతానికి ఫ్రాన్సిస్కాన్ గోధుమలు, బార్లీని పరిచయం చేసినట్లు కొందరు చరిత్రకారులు నమ్ముతారు.1566లో క్విటోలో ఫ్లెమిష్ మూలానికి చెందిన ఫ్రాన్సిస్కాన్ వ్యక్తి జోడోకో రికే తొలిసారిగా ఈ బీర్ తయారు చేశాడు.దీని సూత్రాన్ని తిరిగి పొందడంలో కార్వాజల్ విజయం సాధించాడు.

కాగా ఫ్రాన్సిస్కాన్ చేసిన బీరును ప్రాంతీయంగా చిచా అని పిలిచేవారు.దీనిని లాటిన్ అమెరికాలో పులియబెట్టిన, పులియబెట్టని పానీయంగా సేవించేవారు.

ఇది అండీస్, అమెజోనియా ప్రాంతాల నుంచి ఉద్భవించింది.ఇది అమెరికాను స్పెయిన్ పాలించకముందు అక్కడి స్థానిక ప్రజలు తయారుచేసిన పానీయంగా చెప్పుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube