దేశీయ ఆట‌గాళ్లకు గుడ్ న్యూస్‌.. మ్యాచ్ ఫీజుల పెంపు..

మ‌న దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.కాగా ఇప్పుడు దేశీయ క్రికెటర్ల విష‌యంలో BCCI తీసుకున్న నిర్ణ‌యం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

 Good News For Domestic Players Increase In Match Fees, Cricketers, India, Bcci B-TeluguStop.com

అదేంటంటే దేశీయ క్రికెట‌ర్ల‌కు మ్యాచ్ ఫీజులను పెంచుతూ ఉత్త‌ర్వులు జారీచేసింది.దీంతో వారంద‌రికీ గుడ్ న్యూస్ వ‌చ్చేసింది.

ఇక ఈ విష‌యాన్ని బోర్డు కార్యదర్శి అయిన జైషా సోమవారం ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలియ‌జేశారు.ఇప్ప‌టికే దేశీయంగా 40 కంటే ఎక్కువ క్రికెట్ మ్యాచ్‌లు ఎవ‌రైనా ఆడారో అలాంటి వారంద‌రూ కూడా ఇక‌పై రూ.60,000 వ‌స్తాయ‌ని చెప్పారు.

కాగా వీరితో పాటు 23 ఏండ్ల‌కంటే ఇండియన్ క్రికెట‌ర‌ల్కు త‌క్కువ వ‌య‌స్సు ఉంటే అలాంటి దేశీయ క్రికెట‌ర‌ల్కు రూ.25,000, ఇక వీరితో పాటు 19 ఏండ్ల కంటే తక్కువ ఏజ్ ఉన్న‌వారంతా కూడా రూ .20,000 ఫీజ్ కేట‌గిరీలోకి వ‌స్తున్న‌ట్టు తెల‌పింది బీసీసీఐ.ఇక 2019-2020వ సంవ‌త్స‌రంలో దేశీయ సీజన్ మొత్తం ఆగిపోవ‌డంతో దేశీయ క్రికెటర్లు చాలా వ‌ర‌కు న‌ష్ట‌పోయారిన కాబ‌ట్టి ఈ న‌ష్టాన్ని పూడ్చేందుకు కూడా 21 వ సీజన్‌లో దేశీయ క్రికెట‌ర్ల‌కు మ్యాచ్ కు అదనంగా 50 శాతం వ‌ర‌కు ఫీజు చెల్లిస్తామ‌ని వెల్ల‌డించింది.

Telugu Bcci, Cricket, Cricketers, Fee, India, Indian Cricket, Jai Sha, Jai Sha T

ఇక ఈ విష‌యాల‌న్నింటినీ జై షా ట్వీట్ చేస్తూ చాలా క్లియ‌ర్గా వివ‌రించారు.దీంతో దేశీయ క్రికెట‌ర్ల విష‌యంలో తాజాగా బీసీసీఐ తీసుకున్న నిర్ణ‌యంతో అంద‌రూ చాలా సంతోషిస్తున్నారు.దేశీయ క్రికెట‌ర్ల జీవితాల‌ను ప్ర‌భావితం చేసే విధంగా బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది.

ఇకపై దేశీయ వాలి క్రికెట‌ర్లు ఆడుతున్న వారంద‌రికీ ఈ ఫ‌లాలు అంద‌నున్నాయి.కాగా క‌రోనా స‌మ‌యంలో ప‌డ్డ ఇబ్బందుల‌ను గుర్తు పెట్టుకుని బీసీసీఐ ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంద‌ని జైషా వెల్ల‌డించారు.

ఇకపై దేశీయ క్రికెట‌ర్ల‌కు ఎలాంటి ఆర్థిక ప‌రిస్థితి ఉండొద్ద‌ని ఆయ‌న ఇలా ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్ చేయ‌డం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube