డెలివరీ వ్యాపారులకు శుభవార్త.. మీరు మెచ్చే వాహనం వచ్చేసింది, సింగిల్ ఛార్జింగ్, 154 కోలోమీటర్లు!

మనదేశంలో కొందరు వ్యాపారస్తులు తమ దగ్గర వున్న సరుకుల్ని కస్టమర్ల ఆర్డర్లను బట్టి వివిధ ప్రాంతాలకు తరలిస్తూ వుంటారు.లేదంటే డోర్ టు డోర్ డెలివరీ చేస్తారు.

 Good News For Delivery Merchants The Vehicle You Like Has Arrived , Single Charging, 154 Kilometers , Milk Delivery, Good News, Tata Ev Vehicle, Technology Updates-TeluguStop.com

ఇది ఒకింత సవాళ్లతో కూడుకున్న పనే.ఎందుకంటే, ప్రస్తుతం పెరిగిపోతున్న డీజిల్, పెట్లోల్ ఆయిల్ రేట్ల వలన వినియోగదారుడుతో పాటు కొనుగోలు దారుడు కూడా నష్టపోతున్నాడు.అందుకే అలాంటి వాహనాలకు బదులుగా కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి.ఈ క్రమంలో దేశీయ ఆటో మొబైల్‌ దిగ్గజం అయినటువంటి టాటా మోటార్స్‌ తన ఎలక్ట్రిక్‌ వాహన శ్రేణిని విస్తరించే క్రమంలో తాజాగా బాగా ప్రాచుర్యం పొందిన AS మినీ ట్రక్‌.

ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది.

 Good News For Delivery Merchants The Vehicle You Like Has Arrived , Single Charging, 154 Kilometers , Milk Delivery, Good News, Tata Ev Vehicle, Technology Updates -డెలివరీ వ్యాపారులకు శుభవార్త.. మీరు మెచ్చే వాహనం వచ్చేసింది, సింగిల్ ఛార్జింగ్, 154 కోలోమీటర్లు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాటా AS మినీ ట్రక్‌ను లాంచ్‌ చేసిన 17 ఏళ్ల తర్వాత, AS ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను లాంచ్‌ చేయడం విశేషం.

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, సిటీ లింక్‌, బిగ్‌ బాస్కెట్‌, డాట్‌, లెట్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మొదలగు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్‌.ఆయా సంస్థల నుంచి 39 వేల యూనిట్లకు ఆర్డర్లు పొందింది.

వచ్చే త్రైమాసికం నుంచి వీటి డెలివరీలు ప్రారంభమైనప్పుడు వీటి ధరను వెల్లడించనున్నారు.కొత్త ఏస్‌ ఈవీ 27Kw (36hp) మోటార్‌తో 130Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సింగిల్‌ ఛార్జ్‌తో 154 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది.

ఇందులో అడ్వాన్స్‌ బ్యాటరీ కూలింగ్‌ సిస్టమ్‌ ఉంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా కలదు.ముఖ్యంగా ఇ-కామర్స్‌ లాజిస్టిక్స్‌ కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేసినట్టు తెలుస్తోంది.

పాసింజర్‌ కార్లు, బస్సులను సైతం ఎలక్ట్రిక్‌గా మారుస్తున్నామని, ఇప్పుడు ఈ-కార్గో వంతు వచ్చిందని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ఈ సందర్భంగా మాట్లాడారు.మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ASతో పాటు మరిన్ని కేటగిరీ వాహనాలను సైతం ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చనున్నట్లు చెప్పారు.

సరిగ్గా 17 ఏళ్ల క్రితం వచ్చి ఏస్‌ మినీ ట్రక్‌.ప్రభంజనం సృష్టించిందని, ఇప్పుడు కార్గో విభాగంలో ఏస్‌ ఈవీ సైతం అదే స్థాయిలో మన్ననను పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube