దగ్గుబాటి అభిమానులకు శుభవార్త.. బాబాయ్, అబ్బాయ్ కలిసి?

ప్రస్తుతం ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ -రానా మల్టీస్టారర్ చిత్రంగా వస్తే చూడాలని దగ్గుబాటి అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు.అయితే త్వరలోనే ఆ కోరిక నెరవేరబోతోనట్లు తెలుస్తోంది.

 Good News For Daggubati Fans Rana Venkatesh Combo Fix-TeluguStop.com

అతి త్వరలోనే బాబాయ్.అబ్బాయ్ ఇద్దరు కలిసి ఒకే తెరపై సందడి చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో రానా, వెంకటేష్ కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

 Good News For Daggubati Fans Rana Venkatesh Combo Fix-దగ్గుబాటి అభిమానులకు శుభవార్త.. బాబాయ్, అబ్బాయ్ కలిసి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రామానాయుడు అనే పేరుతో రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో బాబాయ్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

తెర వెనక వెంకీ పై తను ఎంత ప్రేమను చూపిస్తారు రామానాయుడులో కూడా అదేవిధంగా ఉండబోతోందని ఎప్పటినుంచో ఉన్న ఈ కల ఇప్పుడు నెరవేరబోతోంది అంటూ తెలియజేశారు.ఈ విషయంపై వెంకటేష్ స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా.

ఓ చిన్న పిల్లాడి నుంచి పరిణితి చెందిన హీరోగా ఎదిగిన రానాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు.

లోకోమోటివ్ గ్లోబల్ ఇన్ కార్పొరేషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సిరీస్ ని కరణ్ అన్షుమన్ సుపర్న్ వర్మ దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కబోతోందని వచ్చే ఏడాది మార్చి చివరికి ఈ సిరీస్ పూర్తవుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక ప్రస్తుతం వెంకటేష్ దృశ్యం2, ఎఫ్ 3 సినిమాలతో బిజీగా ఉండగా.రానా భీమానాయక్ ఈ చిత్రంతో బిజీగా ఉన్నారు.

#Venkatesh #RanaVenkatesh #Daggupati Rana #Web

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు