కస్టమర్లకు శుభవార్త: ఆ బ్యాంకులో అదిరిపోయే ఇంట్రెస్ట్!

బ్యాంకింగ్ రంగంలో వెలుగొందుతున్న కరూర్ వైశ్యా బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు ఓ శుభవార్తను తెలియజేసింది.ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.

 Good News For Customers The Interest That Is Overwhelming In That Bank, Karur Va-TeluguStop.com

సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది.దీంతో ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరనుంది.

గతంతో పోల్చుకుంటే ఇపుడు సేవింగ్స్ ఖాతాలపై అధిక వడ్డీ రేటు లభించనుంది.బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం జనవరి 28 నుంచే అమలులోకి వచ్చింది.

అంటే నిన్నటి నుండి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయని స్పష్టమౌతోంది.

Telugu Interest Rates-Latest News - Telugu

ఈ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా కలిగిన వారికి గరిష్టంగా 5.25 శాతం వరకు వడ్డీ లభిస్తుందని ఓ తాజా ప్రకటనలో పేర్కొంది.వివరంగా చూసుకుంటే, రూ.5 లక్షలలోపు బ్యాంకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై వడ్డీ రేటు 2.25 శాతంగా ఉంది.అదే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బ్యాలెన్స్ మెంటైన్ చేసేవారికి వడ్డీ రేటు 2.5 శాతంగా ఉంటుంది.ఇక రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై వడ్డీ రేటు 3 శాతం వడ్డీ వస్తుంది.ఇంకా రూ.కోటి నుంచి రూ.100 కోట్ల వరకు బ్యాలెన్స్ వున్నట్లైతే వడ్డీ రేటు 3.25 శాతంగా ఉంది.అలాగే రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై అయితే వడ్డీ రేటు 5 శాతంగాఉంది.

Telugu Interest Rates-Latest News - Telugu

ఇక రూ.150 కోట్లు లేదా ఆపైన బ్యాలెన్స్ ఉంటే మాత్రం 5.25 శాతం వరకు వడ్డీ వస్తుంది.అంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ ప్రతిపదికన కస్టమర్లకు వచ్చే వడ్డీ రేటు మారుతూ ఉంటుందని స్పష్టమౌతోంది.

ఇకపోతే ఈ బ్యాంక్ 2022 డిసెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం ఏకంగా 56 శాతానికి పైగా పెరిగింది.దాదాపు రూ.289 కోట్లుగా నమోదు అయ్యింది.మునపటి ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.185 కోట్లు.నిర్వహణ లాభం రూ.401 కోట్ల నుంచి రూ.689 కోట్లకు చేరింది.నికర వడ్డీ ఆదాయం 29 శాతానికి పైగా పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube