కస్టమర్లకు శుభవార్త... దేశీయ ప్రభుత్వ ఇ-కామర్స్ స్టోర్ ప్రారంభం, ఎన్ని లాభాలో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం తాజాగా ONDC (ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ప్రారంభించింది.ఇది భారత ప్రభుత్వానికి చెందిన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ కావడం విశేషం.

 Good News For Customers  Do You Know How Much Profit The Domestic Government's E-TeluguStop.com

ప్రస్తుతం బెంగళూరులో బీటా టెస్టింగ్ ప్రారంభమైంది.బెంగళూరులో 16 పిన్ కోడ్స్‌కు ONDC ప్రారంభమైంది.200 పైగా గ్రాసరీ స్టోర్లు, రెస్టారెంట్‌లు ఈ ట్రయల్‌లో పాల్గొంటున్నారు.ప్రస్తుతం ఇది ట్రయల్ మాత్రమే.

కొందరు యూజర్లకు మాత్రమే సేవలు అందుబాటులో ఉన్నాయి.వినియోగదారుల నుంచి వచ్చే సలహాలు, సూచనల ఆధారంగా ఈ ప్లాట్‌ఫామ్‌కు మెరుగులు దిద్దుతామని ONDC సీఈఓ T కోషీ తెలిపారు.

అయితే ఈ నెట్వర్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కాస్త సమయం పడుతుందని అన్నారు.అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి దిగ్గజ ఇ-కామర్స్ సంస్థల ఆధిపత్యం, ప్రభావం తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఓఎన్‌డీసీని ప్రారంభించింది.

చిరువ్యాపారులు, స్టోర్లు ఈ నెట్వర్క్‌లో చేరి తమ ప్రొడక్ట్స్ అమ్మొచ్చు.సేవల్ని ఆఫర్ చేయొచ్చు.ఎలాంటి కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగించుకోవచ్చు.

మనిషికి అవసరమైన అన్ని వస్తువులు, తక్కువ ధరకు పొందడానికి ONDC ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది.బెంగళూరు ట్రయల్స్‌లో పేటీఎం, మైస్టోర్, స్పైస్ మనీ బయర్ సైడ్ యాప్స్‌గా చేరాయి.11 సెల్లర్ యాప్స్, 3 లాజిస్టిక్స్ ప్రొవైడర్స్ 16 పిన్‌కోడ్స్‌లో గ్రాసరీ, ఫుడ్ డెలివరీ సేవల్ని అందించనున్నాయి.యూజర్లు సైనప్ అయిన తర్వాత ఈ నెట్వర్క్ ద్వారా ఆర్డర్స్ చేయొచ్చు.బెంగళూరు బీటా టెస్టింగ్‌లో వినియోగదారులు చేరడం ఒకేసారిగా కాకుండా దశలవారీగా జరగనుంది.సెల్లర్ యాప్‌లో 50 మంది ఇప్పటికే చేరారు.ఇందులో 31 కిరాణా స్టోర్స్, సూపర్ మార్కెట్స్, కపివ, బోల్డ్‌కేర్, ట్రూనెక్స్‌ట్, పతంజలి లాంటి 12 డైరెక్ట్ టు కన్స్యూమర్ బ్రాండ్స్ ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube