క్రికెట్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ 2022కు బీసీసీఐ ముహూర్తం ఖరారు...

క్రికెట్ ప్రియులకు గుడ్‌న్యూస్.ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26న ప్రారంభం కాబోతోంది.

 Good News For Cricket Lovers Bcci Finals For Ipl 2022, Ipl 2022, Bcci, Key Deci-TeluguStop.com

తాజాగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మీటింగ్ లో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ సమావేశంలో ఐపీఎల్ 2022 సీజన్ ను మార్చి 26 నుంచి ప్రారంభించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది.

నిజానికి మార్చి 27 అంటే ఆదివారం నుంచి ఐపీఎల్ టోర్నమెంట్ ను స్టార్ట్ చేయాలని బీసీసీఐ ముందుగా అనుకుంది.కానీ అధికార ప్రసార భాగస్వామి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మార్చి 26న టోర్నీని స్టార్ట్ చేయాలని అభ్యర్థించింది.

దీంతో దాన్ని అభ్యర్ధనను మన్నించి మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ సీసన్ ప్రారంభించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఓ ప్రముఖ ఇండియన్ క్రికెట్ న్యూస్ వెబ్ సైట్ వెల్లడించింది.

ఐపీఎల్ 2022 మ్యాచ్ లన్నీ కూడా మహారాష్ట్రలోనే కండక్ట్ చేసేందుకు బీసీసీఐ సిద్ధమయ్యింది.

ముంబైలోని మూడు, పుణేలోని ఒక స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.మహారాష్ట్ర వేదికగానే ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం కానుంది.

అయితే పొట్టి క్రికెట్ లీగ్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను అతి త్వరలోనే రిలీజ్ చేస్తామని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.

అయితే ప్రస్తుతం భారతదేశంలో కరోనా వ్యాప్తి చాలావరకు తగ్గుముఖం పట్టింది.ఈ నేపథ్యంలో మైదానంలోకి ప్రేక్షకులను అనుమతిస్తారా లేదా అనే విషయంపై కూడా బీసీసీఐ ఒక క్లారిటీ ఇచ్చింది.మహారాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ప్రేక్షకుల ఎంట్రీపై నిర్ణయం తీసుకుంటామని బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు.

దీంతో ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్ ను చూడగలరా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇదిలా ఉండగా ఈసారి రెండు కొత్త జట్లు యాడ్ కావడంతో మ్యాచ్ ల సంఖ్య 74కు ఎగబాకింది.అయితే వీటిలో 55 మ్యాచ్‌లు ముంబైలోనే జరగనున్నాయి.15 మ్యాచ్‌లు మాత్రం పుణేలో జరిగేలా బీసీసీఐ ప్లాన్ చేసింది.ఇలా చేసుకుంటే మొత్తం 70 మ్యాచ్‌లు ముంబై, పుణే సిటీల్లోనే జరుగుతాయని చెప్పచ్చు.ఇక మిగతా మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో మరో షెడ్యూల్ విడుదల చేయనుంది బీసీసీఐ!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube