క్రికెట్ అభిమానులకు శుభవార్త... వారికి T20 ప్రపంచకప్ ఫ్రీ టికెట్ ప్రకటించిన ICC!

ICC మహిళల T20 ప్రపంచకప్ కు సంబంధించి షెడ్యూల్ ను సోమవారం రాత్రి విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసినదే.కాగా దీనికి సంబంధించినటువంటి వివరాలు ICC అధికారిక వెబ్ సైట్ లో వున్నాయి.

 క్రికెట్ అభిమానులకు శుభవార్త-TeluguStop.com

రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం.మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో తలపడబోతున్నాయి అని తెలుస్తోంది.

దక్షిణాఫ్రికా ఈ టోర్నీకి వేదిక కానుంది.ఇందులో భాగంగా తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య జరగనుంది.దీనికి సంబంధించి టికెట్ల విక్రయం త్వరలో ప్రారంభం కాబోతుంది.15 రోజుల పాటు కేప్ టౌన్, పార్ల్, బేబీర్జా వేదికలుగా మొత్తం 23 మ్యాచ్ లు జరగనున్నాయి.

 క్రికెట్ అభిమానులకు శుభవార్త-TeluguStop.com

అయితే తాజాగా టికెట్ ధరలను కూడా ICC వెల్లడించింది.టికెట్ ధరలు 60 ర్యాండ్లు (275 రూపాయలు) నుంచి ప్రారంభం అవుతాయి.ఇకపోతే 6 ఏళ్ల లోపు పిల్లలకు టికెట్ ఫ్రీ అని ICC ప్రకటించడం కొసమెరుపు.ఫిబ్రవరి 26న న్యూలాండ్స్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

దీనికి గెస్ట్ గా ఇండియా టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ హాజరు కానున్నారనే విషయం విదితమే.మరోవైపు పురుషుల టి20 ప్రపంచకప్ త్వరలో ఆరంభం కానుంది.

అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచకప్ జరగనుంది.

అక్టోబర్ 16 నుంచి 22 వరకు గ్రూప్ దశ పోటీలు జరగనున్నాయి.ఇందులో 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడతాయి.టాప్ 2లో నిలిచిన నాలుగు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి.

పురుషుల, మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లు కొద్దిరోజుల వ్యవధిలోనే జరుగుతుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.వెన్ను గాయంతో దక్షిణాఫ్రికాతో సిరీస్ కు దూరమైన జస్ ప్రీత్ బుమ్రా టి20 ప్రపంచకప్ కు కూడా దూరమయ్యాడు.

ఈ మేరకు బుమ్రాను టి20 ప్రపంచకప్ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా స్పష్టం చేసింది.

Video : Good News For Cricket Fans ICC Announces T20 World Cup Free Ticket For Them , Cricket Fans, Good News, T20 World Cup, Free Tickets, Sport's Updates, Sports News #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube