క్రియేటర్లకు శుభవార్త.. ఇక ట్విట్టర్ ద్వారా కూడా డబ్బులు సంపాదించొచ్చు!

ఎలాన్‌ మస్క్‌( Elon Musk ) ట్విట్టర్‌( Twitter ) టేకోవర్ చేసిన తరువాత చాలా మార్పులు సంభవించాయి.ఎందరో ఉద్యోగాలు కోల్పోగా బ్లూ టిక్‌కు డబ్బులు చెల్లించాలనే నిబంధనను తీసుకువచ్చాడు మస్క్.

 Good News For Creators.. You Can Earn Money Through Twitter ,good News For Creat-TeluguStop.com

అంతటితో ఆగకుండా లోగో కూడా మార్చడం జరిగింది.ఈ క్రమంలోనే తాజాగా బ్లూ టిక్‌( Blue tick ) తీసేసి కొంతమంది సెలబ్రిటీలందరికి షాకిచ్చాడు.

మస్క్‌ ట్విట్టర్‌ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు.అలాంటి మస్క్‌.

తాజాగా ట్విట్టర్‌ యూజర్లకు, మరీ ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకు శుభవార్త చెప్పాడు.

Telugu Blue Tick, Creators, Elon Musk, Ups-Latest News - Telugu

విషయం ఏమంటే ఇకనుండి ట్విట్టర్‌ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందని మస్క్ చెప్పుకొచ్చాడు.కంటెంట్‌ క్రియేటర్లు( Content creators ) అనేవారు ఇక మీదట యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ మాదిరిగానే ట్విట్టర్‌లోనూ డబ్బులు సంపాదించుకోవచ్చన్నమాట.అందుకోసం మానిటైజేషన్ ప్లాన్‌ను ప్రకటించాడు.

ఎక్కువ సమాచారం నుంచి.ఎక్కువ నిడివి ఉన్న వీడియోల వరకు.

దేనికైనా సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌తో డబ్బు సంపాదించవచ్చని వెల్లడించాడు.ఇందుకోసం యూజర్లు అనేవారు సెట్టింగ్స్‌లోకి వెళ్లి, మానిటైజ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

Telugu Blue Tick, Creators, Elon Musk, Ups-Latest News - Telugu

ఇకపోతే ఈ ఆప్షన్‌ ఇప్పటికే అమెరికాలో అందుబాటులో ఉండగా త్వరలో ఇది మరిన్ని దేశాలకు విస్తరించనుంది.అయితే, ఈ ప్రయోజనాలు పొందాలంటే మాత్రం యూజర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందడం తప్పనిసరి.ట్విట్టర్‌లో షేర్ చేసే లాంగ్‌ఫామ్ కంటెంట్, ఇమేజ్‌లు, వీడియోలకు మాత్రమే సబ్‌స్క్రిప్షన్ పనిచేస్తుందని మస్క్ ప్రకటించాడు.ఇక యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ వంటి పోటీ సంస్థలతో పోలిస్తే ట్విట్టర్ ప్రస్తుతం పరిమితంగా మాత్రమే మానిటైజేషన్ ఆప్షన్లను అందించడం విశేషం.

కాబట్టి ఇది క్రియేటర్ల పాలిట వరంగా మారనుంది.ఈ క్రమంలో మస్క్‌ ఇచ్చిన ఆఫర్‌పై ట్విట్టర్‌ యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కొందరు మాత్రం.ఎక్కువ మంది ట్విట్టర్‌ వినియోగించేలా చేయడం కోసం మస్క్‌ వేసిన వ్యూహం అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube