వినియోగదారులకు శుభవార్త... 11 రకాల నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గాయి, చూసుకోండి!

అవును మీరు విన్నది నిజమే.కరోనా తరువాత నిత్యావసర వస్తువులకు బాగా రేట్లు పెరగడంతో సామాన్యులపై గొడ్డలిపెట్టులాగా మారింది.

 Good News For Consumers 11 Types Of Essential Items Have Reduced Rates, Check It-TeluguStop.com

అయితే తాజాగా వారికి ఊరటనిచ్చే వార్త కేంద్రం తెలిపింది.అవును, మీరు విన్నది నిజమే.

నిత్యావసర వస్తువుల ధరలు భారీగా దిగివచ్చాయి.వంట నూనెల దగ్గరి నుంచి ఉల్లిపాయల వరకు పలు వస్తువుల ధరలు దిగి వచ్చాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

ఏ ఏ వాటి ధరలు ఎంత మేర తగ్గాయో కూడా ఆయన చెప్పడం గమనార్హం.ఇప్పుడు మనం నిత్యావసర వస్తువుల ధరలు ఎంత తగ్గాయో, ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

పామ్ ఆయిల్ ధర 11 శాతం మేర తగ్గింది.సెప్టెంబర్ 2న పామ్ ఆయిల్ ధర లీటరుకు రూ.132గా ఉంటే అది అక్టోబర్ 2న రూ.118గా వుంది.అలాగే వనస్పతి నెయ్యి ధర 6 శాతం మేర తగ్గింది.రేటు కేజీకి రూ.152 వద్ద ఉండేది ఇప్పుడు రూ.143 మేర దిగివచ్చింది.పప్పుదినుసులు గ్రామ్ దాల్ రేటు 4 శాతం తగ్గింది.కేజీకి రూ.74 నుంచి రూ.71కు తగ్గింది.అలాగే మసూర్ దాల్ రేటు కేజీకి రూ.97 నుంచి రూ.94కు దిగివచ్చింది.ఉరద్ దాల్ రేటు 2 శాతం తగ్గుదలతో కేజీకి రూ.108 నుంచి రూ.106కు తగ్గింది.ఇక ఉల్లిపాయల ధరలు 8 శాతం పడిపోయాయి.గత నెలలో కేజీకి రూ.26గా ఉన్న ఉల్లిపాయలు ఇప్పుడు రూ.24కు తగ్గాయి.ఇక పొటాటో 7 శాతం దిగివచ్చింది.కేజీకి రూ.28 నుంచి రూ.26కు తగ్గింది.

సన్‌ఫ్లవర్ ఆయిల్ రేటు 6 శాతం క్షీణించింది.గత నెలలో లీటరుకు రూ.176గా ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ రేటు ఇప్పుడు రూ.165కు దిగి వచ్చింది.అలాగే సోయాబీన్ ఆయిల్ రేటు 5 శాతం మేర క్షీణించింది.గత నెలలో లీటరుకు రూ.156 వద్ద ఉన్న ఈ ఆయిల్ రేటు ఇప్పుడు రూ.148కి తగ్గింది.దేశంలో వంట నూనె ధరలు తగ్గుతూ వస్తున్నాయని కేంద్రం పేర్కొంటోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు దిగి రావడం, అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న సుంకాల రాయితీ వంటి నిర్ణయాల వల్ల దేశంలో ఎడిబుల్ ఆయిల్స్ రేట్లు తగ్గాయని వివరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube