మద్య తరగతి వారికి కాస్త ఊరటనిచ్చిన కేంద్ర ప్రభుత్వ ప్రకటన.. రూ.350 ని రూ.150కి తగ్గించారు

జనవరి 1వ తారీకు నుండి కొత్త కేబుల్‌ విధానం వచ్చిన విషయం తెల్సిందే.చూసిన వాటికి మాత్రమే చెల్లించండి అంటూ ఆపరేటర్లకు, ఛానెల్స్‌ యాజమాన్యానికి, వినియోగదారులకు ఊరట అంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త పద్దతిని తీసుకు వచ్చింది.

 Good News For City Cable Users-TeluguStop.com

అయితే ఛానెల్స్‌ యాజమాన్యాలు భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్న నేపథ్యంలో వినియోగదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు.స్థానిక ఛానెల్స్‌ చూడాలన్నా కూడా వందలకు వందలు పే చేయాల్సిన పరిస్థితి.

అయితే సామాన్యులు పడుతున్న బాధల నుండి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర సమాచార శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగుకు చెందిన ఛానెల్స్‌ అన్ని కూడా చూడాలి అంటే ప్రస్తుతం నెలకు 350 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది.కాని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నిర్ణయంతో 100 చానెల్స్‌కు 153 రూపాయలను మాత్రమే వసూళ్లు చేయాలి.కేబుల్‌ ఆపరేటర్స్‌ అయినా, డీటీహెచ్‌ ఆపరేటర్స్‌ అయినా కూడా అంతకు మించి వసూళ్లు చేయవద్దని కేంద్ర ఆర్డినెన్స్‌ తీసుకు వచ్చింది.

ఫిబ్రవరి 1 నుండి ఈ నిర్ణయం అమలు లోకి రాబోతుంది.అదే జరిగితే తెలుగు ఛానెల్స్‌ మొత్తం కూడా ఫిబ్రవరి 1 నుండి 153 రూపాయలకు చూసేయొచ్చు.

సామాన్యులకు ఇది పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు.చూసే కొన్ని ఛానెల్స్‌కు కూడా వందలకు వందలు ప్యాకేజీల పేరుతో వసూళ్లు చేస్తున్న ఛానెల్స్‌ యాజమాన్యాలకు కేంద్రం ఇచ్చిన షాక్‌గా చెప్పుకోవచ్చు.కేంద్ర ప్రభుత్వం త్వరలో ఎన్నికల నేపథ్యంలో సామాన్యులపై భారం వద్దనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కొందరు చెబుతున్నారు.

ఈ నిర్ణయంపై కేబుల్‌ ఆపరేటర్లతో పాటు ఛానెల్స్‌ యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.150 కాకున్నా కనీసం 200 రూపాయలైన నిర్ణయిస్తే బాగుండేదనే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు.అయితే సామాన్యులు మాత్రం 100 రూపాయలు ఉంటే ఇంకా బాగుండేదని అంటున్నారు.

మొత్తానికి గుడ్డిలో మెల్ల అన్నట్లుగా మద్య తరగతి వారికి మోడీ ప్రభుత్వం కాస్త ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube