కేంద్ర ఉద్యోగులకు భారీగా పెరగనున్న వేతనాలు.. కారణం అదే!

కరోనా వైరస్ వల్ల ప్రపంచం అంత ఆగిపోయిన సంగతి తెలిసిందే.ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వల్ల ప్రపంచమంతా కొన్ని నెలల పాటు ఆగిపోయింది.

 Salaries Of Central Govt Employees May Rise In 2021, Salary Hike. Dearness Allow-TeluguStop.com

ఈ కరోనా కాలం వల్ల ఎంతోమంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.ప్రస్తుతం మెల్లగా కోలుకుంటూ వస్తున్నారు.

అయితే కరోనా లాక్ డౌన్ కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడ్డారు.సగం జీతాలతోనే జీవితాన్ని నెట్టుకొచ్చారు.

అష్టకష్టాలు పడ్డారు.ఇక ఈ నేపథ్యంలోనే వారి కష్ఠాలను తీర్చేందుకు 2021లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెన్షన్లు పెరగనున్నాయ్.

కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు ఈ శుభవార్త చెప్పింది.వారి పెన్షన్లను పెంచాలని కేంద్రం నిర్ణయించింది.వచ్చే ఏడాది 7 వ వేతన కమిషన్ సిఫార్సులు మేరకు ఉద్యోగుల డీఏ పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇక ఉద్యోగులకు కూడా నాలుగు శాతం డీఏ పెంచేందుకు కేంద్ర ప్రభుతం ఆమోదం తెలిపింది.

అంతేకాదు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆపేసిన ఏప్రిల్ డీఏను కూడా పునరుద్దరించాలని కేంద్రం నిర్ణయించింది.

ఇక దీని వల్ల సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు 60 లక్షల మందికి పైగా పింఛన్ దారులు లబ్ధి పొందనున్నారు.

ఉద్యోగులకు ప్రస్తుతం కేంద్రం 17 శాతం డీఏ ఇస్తోంది.నిజానికి ఈ సంవత్సరం ప్రారంభంలోనే డీఏ పెంపును కేంద్ర ప్రభుతం చెయ్యాల్సి ఉంది.కానీ వచ్చే జులై వరకు ఆంక్షలు విధిస్తు ఆదేశాలు ఇచ్చింది.ఇప్పుడు కేంద్రం ఏటా రెండు సార్లు డీఏ పెంచనున్నట్టు జనవరి లో కేంద్రం ముందుకు డీఏ పెంపు ప్రతిపాదన చెయ్యాలని నిర్ణయించారు.

ఏది ఏమైనా కేంద్ర ఉద్యోగుల పెన్షనర్లకు ఇది శుభవార్త అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube