బిగ్ బాస్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఆ జబర్దస్త్ స్టార్ ఎంట్రీ..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4 తెలుగులో కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియపై ప్రేక్షకుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.ఏ మాత్రం ఫేమ్ లేని కంటెస్టెంట్లను సీజన్ 4కు ఎంపిక చేశారని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వినిపించాయి.

 Good News For Bigg Boss Fans About Jabardast Star Entry, Jabardast Varsha, Varsh-TeluguStop.com

అయితే కరోనా వల్ల ఇంటికే పరిమితమైన ప్రేక్షకులకు భారీగా ఎంటర్టైన్మెంట్ ను ఇవ్వడంతో బిగ్ బాస్ సీజన్ 4 వార్తల్లో నిలిచింది.
నాగార్జున హోస్టింగ్ కూడా బిగ్ బాస్ సీజన్ 4 ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి కారణమైంది.

అయితే బిగ్ బాస్ సీజన్ 5లో జబర్దస్త్ షో ద్వారా ఈ మధ్య కాలంలో భారీగా పాపులారిటీని సొంతం చేసుకున్న వర్ష పాల్గొంటున్నారని ఒక వార్త వినిపిస్తోంది. వర్ష బిగ్ బాస్ షోలో పాల్గొంటే మాత్రం ఆ షో కచ్చితంగా వర్ష కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

మరి వర్ష నిజంగా బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Telugu Bigg Boss, Bigg Boss Fans, Biggboss, Varshabigg-Movie

కెరీర్ తొలినాళ్లలో సీరియళ్లలో ఎక్కువగా నటించిన వర్ష ఆ సీరియళ్ల ద్వారా పెద్దగా గుర్తింపును సొంతం చేసుకోలేకపోయారు.అయితే జబర్దస్ షో ద్వారా వర్షకు గుర్తింపును తీసుకురావడంతో పాటు ప్రేక్షకుల్లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు.బిగ్ బాస్ షో తర్వాత ఎంతోమంది కంటెస్టెంట్ల తలరాతలు మారిపోయాయి.

తాజాగా వర్ష బిగ్ బాస్ సీజన్ 5 అని రాసి ఒకమ్మాయి ఆలోచిస్తున్న ఎమోజీని షేర్ చేసింది.

వర్ష నిజంగానే బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనబోతున్నారా.? లేదా.? తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.ఈ సీజన్ లో పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లకే ఎక్కువగా అవకాశం ఇవ్వాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube