బాలయ్య 'ఫ్యాన్స్'కి గుడ్ న్యూస్.. నాలుగేళ్ల వరకు పండగే పండగ!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ.ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

 Good News For Balayya Fans Back To Back Movies Powerful Line Up-TeluguStop.com

ఓ సినిమా షూటింగ్ బిజీలో ఉండగానే మరో సినిమా షూటింగ్ కు ఓకే చెబుతున్నాడు.ప్రస్తుతం బాలయ్య యంగ్ హీరోల కంటే ఎక్కువ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

ఇక ఈయన ఫ్యాన్స్ కూడా ఈయన సినిమాలకు తెగ ఎదురు చూస్తున్నారనే చెప్పవచ్చు.తాజాగా బాలయ్య ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్ అందింది.

 Good News For Balayya Fans Back To Back Movies Powerful Line Up-బాలయ్య ఫ్యాన్స్’కి గుడ్ న్యూస్.. నాలుగేళ్ల వరకు పండగే పండగ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా టీజర్ తోనే ప్రేక్షకులు సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.

ఎందుకంటే ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.ఇందులో బాలయ్య ద్వి పాత్రలతో మెప్పించనున్నట్టు తెలుస్తుంది.

Telugu Anil Ravipudi, Back To Back Movies, Balakrishna, Tollywood-Movie

అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వం లో మరో సినిమా చేయనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.ఇందులో మాస్, పవర్ ఫుల్ డైలాగ్, యాక్షన్ వంటివి ఎక్కువగా ఉంటాయని తెలిసింది.ఇక ఇవే కాకుండా వెంకీ అట్లూరి బాలయ్య కోసం ఓ కథ రాస్తున్నట్లు తెలిసింది.పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో కథ తెరకెక్కనుందట.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

దీంతో మరో నాలుగేళ్ల వరకు ఈ సినిమాలను వరుసగా నటించనున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి మరో నాలుగేళ్ల వరకూ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.ఇక తాజాగా తన కొడుకు మోక్షజ్ఞ తో ఓ సినిమా చేయనున్నట్లు కూడా ప్రకటించారు.

ఇంకేముంది బాలయ్య ప్రస్తుతం యంగ్ హీరోల ను తొక్కి పడేసాడనట్లు తెలుస్తోంది.

#Anil Ravipudi #BackTo #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు