వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీయం.. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నగదు బహుమతి.. !

ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.కాగా ఉగాది పండుగను పురస్కరించుకుని వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా వారికి సత్కారం, అవార్డుల ప్రదానోత్సవాలను నేటి నుంచి నిర్వహించనుంది
.

 Good News For Ap Volunteers-TeluguStop.com

ఇకపోతే ప్రతి జిల్లాలో రోజుకొక నియోజకర్గం చొప్పున ఏప్రిల్‌ 28వ తేదీ వరకు వాలంటీర్లకు సత్కార కార్యక్రమాలు కొనసాగనున్నాయని వెల్లడిస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజక వర్గంలో సీఎం జగన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఇందులో భాగంగా వాలంటీర్ల పనితీరు ఆధారంగా సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర వంటి అవార్డులతో 3 కేటగిరీల్లో సత్కరించనున్నారట.

 Good News For Ap Volunteers-వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీయం.. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నగదు బహుమతి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతే కాకుండా ఈ సత్కారం పొందుతున్న వాలంటీర్లకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నగదు బహుమతితో పాటు మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జిలను అందజేస్తారట.ఇకపోతే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని మే 4వ తేదీ తర్వాత నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

#Rs 10 Thousand #Volunteers #Cash Prize #YS Jagan #Rs 30 Thousand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు