విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి సమయం ఆదా

ఒకప్పుడు విమానాల్లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, వీవీఐపీలు, వీఐపీలు, సంపన్నులు మాత్రమే ప్రయాణించేవారు.విమాన ప్రయాణాన్ని లగ్జరీగా భావించేవారు.

 Good News For Air Passengers.. Save Time From Now On  Digi Yatra, Good News, Pas-TeluguStop.com

జీవితంలో ఒక్కసారైనా సరే విమాన ప్రయాణం చేయాలని సామాన్య, మధ్యతరగతి ప్రజలు కలలు కనేవాళ్లు.విమాన ప్రయాణాన్ని సామాన్య, మధ్యరగతి ప్రజలు ఒకప్పుడు కలగానే భావించేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.తక్కువ ధరకే విమనా ప్రయాణాన్ని చాలా సంస్థలు కల్పిస్తున్నాయి.

సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణించేలా ఆపర్లు, డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి విమానయాన సంస్థలు.తక్కువ ధరకే టికెట్ అందిస్తున్నాయి.

దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా విమాన ప్రయాణాలు చేస్తున్నారు.

ఏదైనా దూర ప్రాంతాలకు లేదా ఏదైనా అర్జంట్ పని మీద వెంటనే ఏదైనా ప్రాంతానికి వెళ్లాలంటే విమాన ప్రయాాణాన్ని ఎంచుకుంటారు.

దూర ప్రాంతాలకు బస్స ప్రయాణం చేయాలంటే చాలా గంటల సమయం పడుతుంది.ఇక ట్రైన్ లో వెళ్లాలన్నా సూదూర ప్రాంతాలకు ఎక్కువ సమయ పడుతుంది.విమాన ప్రయాణం అయితే రెండు,మూడు గంటల్లో సులువుగా వెళ్లవచ్చు.అందుకే సౌకర్యవంతగా ప్రయాణం చేసేందుకు చాలామంది విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు.

Telugu Digi Yatra, Travel, Passenger, Train-Latest News - Telugu

అయితే తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ, బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్ పోర్టులు డిజి యాత్ర యాప్ ను అందుబాటులోకి తెచ్చాయి.ఈ యాప్ ద్వారా ఈ రెండు ఎయిర్ పోర్టుల్లో పేపర్ లెస్, కాంటాక్ట్ లెస్ విధానంలో సులువుగా చెక్ ఇన్ అవ్వవచ్చు.ఎయిర్ పోర్టులోని వివిధ చెక్ పోస్టులను డిజిటల్ విధానంలో సులువుగా చెక్ ఇన్ అవ్వవచ్చు.చెక్యూరిటీ చెక్, ఎయిర్ క్రాఫ్ట్ బోర్టింగ్ వంటి వాటిని ఫేషియల్ రికగ్నెషన్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ గా పూర్తి అవుతుంది.

ఈ మేరకు యాప్ కు బోర్డింగ్ పాస్ ను లింక్ చేశారు.సాధారణ విధానం ద్వారా అయితే చాలాసేపు క్యూలో నిల్చోవాల్సి ఉంటుంది.దీని వల్ల చాలా టైమ్ వేస్ట్ అవుతుంది.అయితే డిజిటల్ విధానం ద్వారా వెంటనే చెక్ ఇన్ అవ్వవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube