గుడ్ న్యూస్....అమెరికా వీసా పై కీలక ప్రకటన చేసిన ఎంబసీ...!!

అమెరికాలో కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తరువాత వీసా జారీల విషయంలో మరీ ముఖ్యంగా స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియని వేగవంతం చేసింది.ఈ క్రమంలో ఎన్నో ఏళ్ళుగా అమెరికా వెళ్లి చదువుకోవాలని అక్కడే స్థిరపడాలని కలలు కన్న వారందరూ వీసా కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

 Good News Embassy Made A Key Announcement On Us Visa , Us Visa, Embassy, Us Go-TeluguStop.com

అయితే ఇలాంటి వారందరికీ అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది.అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కొన్ని క్యాటగిరిలకు చెందిన వీసాలకు మాత్రం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ ఎలాంటి.

ఇంటర్వ్యూలు నిర్వహించబోమని, రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది.ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఈ కీలక ప్రకటన చేసింది.హెచ్ -1, హెచ్ -3 , హెచ్ -4 అలాగే ఎఫ్, ఎల్ తదితర వీసాలకు అప్లై చేసుకున్న వారు అంతేకాకుండా అకాడమిక్ జే వీసా దారులు కూడా ఈ మినహాయింపు కిందకు వస్తారని తెలిపింది.అంతేకాదు వీసా కలిగి ఉండి గడువు ముగిసిన తరువాత 48 నెలల లోగా రెన్యువల్ కు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇంటర్వ్యూ ల నుంచీ మినహాయింపు ఇస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలాఉంటే.

వీసా అప్పాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం అమెరికా ప్రభుత్వం బ్యాడ్ తెలిపింది.

వీసా అప్పాయింట్ కోసం ఎదురు చూస్తున్న వారందరూ మరింత కాలం ఆగక తప్పదని అమెరికా స్పష్టం చేసింది.ఒక వేళ వీసాను వేగంగా కోరుకునే వారు ఎవరైనా ఉంటే అత్యవసర సమయంలో ఎక్స్పి డైటెడ్ అప్పాయింట్మెంట్ ఉంటుందని దీనికోసం ఆన్లైన్ లో అభ్యర్ధన చేసుకోవచ్చునని ఒక వేళ ఈ అప్పాయింట్మెంట్ దొరకక పొతే అధికారులు ఈ మెయిల్ ద్వారా అభ్యర్ధులకు వివరాలు చెప్తారు.

అయితే ఈ ఎక్స్పి డైటెడ్ అప్పాయింట్మెంట్ లు సైతం అతి తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఎంతో మంది ఈ వీసా కోసం ఆన్లైన్ లో చెల్లింపులు చేసుకుని ఉన్నారని కానీ వీటి కాలపరిమితి అయిపోతున్నందున 2023 వరకూ పెంచుతున్నట్టుగా అమెరికా తెలిపింది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube