చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్… ఆ స్టార్స్ తిరిగి మళ్లీ మైదానంలోకి…!  

Ambati Rayudu and Dwayne Bravo Fit for Next Match Says CEO Viswanathan, Chennai Super Kings, IPL match , Ambati Rayudu, Dwayne Bravo , - Telugu Ambati Rayudu, Ambati Rayudu And Dwayne Bravo Fit For Next Match Says Ceo Viswanathan, Chennai Super Kings, Dwayne Bravo, Ipl, Ipl Match, Ipl2020, Srh, Vishvanadam

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.ప్రస్తుతం ఐపీఎల్ 13వ సీజన్లో వరుస ఓటములతో చతికల పడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో చేరేందుకు వారి కీలకమైన ఆటగాళ్లు రెడీ అయ్యారు.

TeluguStop.com - Good News Chennai Super Kings Fans Ambati Rayudu Bravo Next Match

చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం మూడు మ్యాచ్ లు ఆడగా అందులో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ని ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ ఆతర్వాత రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో ఓడిపోయింది.

అసలు విషయంలోకి వెళితే… జట్టులో కీలక ఆటగాడైన వెస్టిండీస్ ఆల్ రౌండర్ డేన్ బ్రేవో తన వ్యక్తిగత కారణంగా ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.ఇక మొదటి మ్యాచ్లో తన మార్క్ ను చూపెట్టిన అంబటి రాయుడు తొడ కండరాలు పట్టుకుపోవడంతో తర్వాత రెండు మ్యాచ్లకు కూడా అతడు దూరమయ్యాడు.

TeluguStop.com - చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్… ఆ స్టార్స్ తిరిగి మళ్లీ మైదానంలోకి…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పుడు వీరిద్దరూ ఫిట్నెస్ పూర్తిగా సాధించారని చెన్నై సూపర్ కింగ్స్ ఆడే తర్వాతి మ్యాచ్ లలో వీరిద్దరూ సిద్ధంగా ఉన్నారంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథం తెలియజేశారు.

తొడ కండరాలు పట్టుకున్న అంబటి రాయుడు తాజాగా ట్రైనింగ్ స్టేషన్ లో బాగా పరిగెత్తడం మాత్రమే కాకుండా పూర్తి ఫిట్నెస్ సాధించాడని, అంతే కాకుండా చాలా సేపు బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడని విశ్వనాథం తెలియజేశారు.

ఇక మరో ఆటగాడు బ్రావో విషయం వస్తే..

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు లోయర్ ఆర్డర్ లో అతడు ఓ పెద్ద బలం.అంతేకాదు బౌలింగ్ విషయంలో కూడా అతడు దిట్ట.బ్రేవో కూడా తన తొడ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని ప్రస్తుతం నెట్స్ లో బ్రేవో బాగా బౌలింగ్ చేస్తున్నాడని సీఈవో విశ్వనాథం తెలియజేశారు.దీంతో చెన్నై సూపర్ కింగ్స్ బలం మరింతగా పెరగనుంది.

చూడాలి మరి వీరిద్దరూ టీం లోకి వస్తే మ్యాచ్ గెలుస్తుందో లేదో.చెన్నై సూపర్ కింగ్స్ తన తర్వాత మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరగనుంది.

#Ambati Rayudu #Vishvanadam #AmbatiRayudu #ChennaiSuper #Dwayne Bravo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Good News Chennai Super Kings Fans Ambati Rayudu Bravo Next Match Related Telugu News,Photos/Pics,Images..