గుడ్ న్యూస్: బట్టతలతో బాధపడేవారికి శుభవార్త..!

నేటి సమాజంలో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో బట్టతల సమస్య ఒకటి.ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు.

 Good News, Bald Head, Mens, 30 Years, Health Care, Tips, Latest News, Treatment,-TeluguStop.com

ఈ నేపథ్యంలో చాలా మంది సరైన ఫుడ్ తీసుకోరు.ఒత్తితో బాధపడుతుంటారు.

చికాకులతో సతమతమైపోతుంటారు.ఈ సమస్య యువతలో ఎక్కువగా కనిపిస్తుంది.

ముందు రోజుల్లో అయితే 60 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే బట్టతల వచ్చేది.కానీ నేడు 30 ఏళ్ల లోపు వారికి బట్టతల వచ్చేస్తోంది.

టెక్నాలీజీ పెరుగుతోంది.అలాగే బట్టతల వచ్చే ఏజ్ కూడా ఇప్పుడు చాలా దగ్గరికి వచ్చేసింది.

వయసు తక్కువగా ఉన్నవారు కూడా బట్టతల రావడం వల్ల వయసు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.ప్రధానంగా ఈ సమస్య వల్ల అనేక మంది మానసిక ఆందోళనను ఎదుర్కొంటున్నారు.

పెళ్లికాని యువకులు ఎక్కువగా బట్టతల రావడంతో లోలోపల కుమిలిపోతున్నారు.దీంతో వారికి పెళ్లి కాకుండా పోతోంది.

అందుకే దీనిపై శాస్త్రవేత్తలు విభిన్న పరిశోదనలు చేస్తూ దీనికి ఓ పరిష్కార మార్గాన్ని వెతుకుతున్నారు.

Telugu Bald, Care, Latest, Tips-General-Telugu

బట్టతలపైన జుట్టును మొలిపించేందుకు ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు.ప్రస్తుతం బట్టతల మీద జుట్టు రావడానికి కొన్ని రకాల ఇంజెక్షన్లు వస్తున్నాయి.కుదుళ్ల ప్రాంతం నుంచి నానో కణాలను పంపిస్తారు.ఆ తర్వాత వెంట్రుకలను మొలిపిస్తారు.ఈ ఫార్ములాతో ఎలుకలపై జరిపిన ప్రయోగం విజయవంతమైంది.ఈ విషయాన్ని అమెరికన్ కెమికల్ సొసైటీ పరిశోధకులు తెలిపారు.జుట్టు రాలేటటువంటి ప్రక్రియను ఆండ్రోజెనిక్ అలొపేసియా అని అంటారు.

దీనినే వాడుకలో బట్టతల అని పిలుస్తారు.సరైన రక్తనాళాలు లేకపోవడమే వెంట్రుకలు పెరగడానికి ముఖ్య కారణమని, అందుకే వెంట్రుకలు పెరగడానికి పెట్టే కొత్త కణాలు చనిపోతూ ఉన్నాయని పరిశోధనలో తేలింది.

వీటిని చెక్ పెట్టేందుకే నానో కణాలను ప్రయోగించి జుట్టును మొలిపిస్తున్నారు.ఇది సక్సెస్ అయితే ఇక బట్టతల ఉండేవారికి ఆ ఇబ్బందేమీ ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube