గుడ్ న్యూస్.. పేటీఎంలో ఏఈపీఎస్ సర్వీసులు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్తను వినిపించింది.పేమెంట్స్ బ్యాంకులో కొత్త సర్వీసును స్టార్ట్ చేసింది.

 Paytm, Aeps Services, Customer, Good News-TeluguStop.com

పేమెంట్స్ బ్యాంక్ లో ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీసు (ఏఈపీఎస్)ను పేటీఎం ఆవిష్కరించింది.పేటీఎం ఆధార్ కార్డు సాయంతో వినియోగదారులు డబ్బులు వేయడం, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి సేవలను పొందవచ్చని సంస్థ పేర్కొంది.

దీంతో పాటుగా డబ్బులు డిపాజిట్ చేయడం, ఇంటర్ బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ వంటి సర్వీసులను త్వరలో ప్రారంభించే ఆలోచనలో ఉంది.పేటీఎం వినియోగదారులు ఆధార్ తో లింక్ అయితే చాలని, ఏఈపీఎస్ సర్వీసులను పొందవచ్చని సంస్థ ప్రకటించింది.

ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తే బ్యాంకులకు, ఏటీఎంలు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలు, సెమీ పట్టణ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని సంస్థ పేర్కొంది.దేశంలో ఆర్థిక సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఏఈపీఎస్ సర్వీసులను ప్రారంభించడం జరిగిందని సంస్థ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం పూర్తి బ్యాంకింగ్ సేవలు పొందడమే సంస్థ ఉద్దేశమని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఎండీ సతీష్ కుమార్ గుప్తా తెలిపారు.ఈ సర్వీసును వేగవంతం చేయడానికి పదివేలకు పైగా వ్యాపార కరస్పాండెంట్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఆయన అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube