హెచ్ 4 EAD పై - గుడ్ న్యూస్..     2018-11-12   13:38:52  IST  Surya

గతకొంతకాలంగా భారతీయ ఐటీ నిపుణుల్ని కలవరపెడుతున్న H4 EAD రద్దు అంశంపై కొంత ఊరటనిచ్చే వార్త ఇచ్చింది అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ..అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది..ఈ హామీతో ఎన్నారైలలో ముఖ్యంగా భారతీయులలో సంతోషం వెల్లివిరుస్తోంది..సరే అసలు విషయంలోకి వెళ్తే.

Good News About H4 Visa Holders-

హెచ్‌ 4 EAD వీసా రద్దుపై ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని..ఈ విషయంలో ఎవరూ కూడా కంగారు పడవలసిన అవసరం లేదని…ఈ ప్రతిపాదనపై కార్పొరేట్లు, చట్టసభల ప్రతినిధులు కూడా ఆందోళన చెందనవసరం లేదని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ప్రకటన చేసింది…ఈ మేరకు యూఎస్‌సీఐఎస్‌ ప్రతిపాదనలు రూపొందించగానే తాము ప్రజల ముందు ఉంచుతామని తెలిపింది..

Good News About H4 Visa Holders-

హెచ్‌ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములు , అదేవిధంగా 21 ఏండ్లలోపు ఉండే పిల్లలకి ఈ హెచ్‌ 4 వీసా మంజూరు చేస్తారు. వీరు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే వీలుంది…ఈ వీసా కింద ప్రస్తుతం 70 వేల మందికి పైగా భారతీయ మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు..ఒక వేళ ట్రంప్ నిబంధనల్ని అమలుచేస్తే వీరందరూ భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది…అయితే తాజా ప్రకటనతో ఇప్పుడు విదేశీ ఉద్యోగులకి కొంత ఊరట లభించినట్టు అయ్యింది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.