ఫాల్గుణ మాస అమావాస్యరోజు ఈ పనులు చేయటం వల్ల అంతా శుభం..!

తెలుగు నెలలో చివరి నెల అయిన ఫాల్గుణ మాస అమావాస్య హిందువులందరికీ ఒక పర్వదినం అని చెప్పవచ్చు.దీనిని కృష్ణపక్ష అమావాస్య అని కూడా పిలుస్తారు.

 Good Luck Doing All These Things On The New Moon Day Of The Month Of Falguna, Am-TeluguStop.com

ప్రతి సంవత్సరం వచ్చే పాల్గుణ మాస అమావాస్య కన్నా ఈ ఏడాది వచ్చే ఫాల్గుణ మాస అమావాస్య ఎంతో పవిత్రమైనది.ఎందుకంటే ఫాల్గుణ అమావాస్య రోజే శంకరాచార్య అమావాస్య కూడా వచ్చింది.

అదే విధంగా వేద పండితుల ప్రకారం నాలుగు గ్రహాలు కూడా ఈ అమావాస్య రోజు వస్తాయని తెలియజేస్తున్నారు.

నాలుగు రాశులైన సూర్యుడు, చంద్రుడు, బుదుడు, శుక్రుడు ఈ అమావాస్య రోజు కుంభ రాశిలోకి ప్రవేశిస్తారు.

ఈ విధంగా 4 రాశులు కుంభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ అమావాస్య ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శని అమావాస్య రోజు పితృ దోషాలు, కాలసర్ప దోషం, అమావాస్య దోషాలు వంటివి ఉన్నవారు ఈ అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలను, దానధర్మాలను చేయటం ద్వారా ఈ దోషాలను తొలగించుకోవచ్చు అని పండితులు తెలియజేస్తున్నారు.

ఎంతో ప్రత్యేకమైన శనీశ్వర అమావాస్య రోజున కేవలం పితృ దేవతల గురించి మాత్రమే కాకుండా శనిదేవుని గురించి మంత్రం చదువుతూ ఉపవాసం చేయడం వల్ల శని గ్రహ దోషాలు తొలగిపోతాయి.అదేవిధంగా శనీశ్వర అమావాస్య రోజు శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రాలు దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ఈ అమావాస్య శనివారం రావడంతో ఈ అమావాస్య రోజు హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయటం, రావిచెట్టుకు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.అయితే ఈ పాల్గుణ అమావాస్య మార్చి 12వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అమావాస్య ప్రారంభమయి 13వ తేదీ ఉదయం 3 గంటల52 నిమిషాలకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు.

ఈ సమయంలో ఎంతో భక్తి భావంతో శనీశ్వరుని పూజించడం వలన ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుందనీ పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube