భలే ఉద్యోగం: కేవలం 24 గంటలు చెప్పులు ధరిస్తే 4 లక్షలు మీ సొంతం..! ఎక్కడంటే..?!

ఈ ప్రపంచంలో కొన్ని రకాల ఉద్యోగాలు చాలా ఆశ్చర్యం వేస్తుంది.ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా ? వాటికి ఎలా అప్లై చేసుకోవాలి ? ఒకవేళ అప్లై చేశాక ఎన్ని రోజులు ఆ ఉద్యోగం ఉంటుంది లాంటి వివరాలను వెతికి మరి ఉద్యోగాలకు అప్లై చేస్తుంటారు కొందరు.ఇంట్లోనే కూర్చొని లక్షలు సంపాదించే ఉద్యోగాలు కూడా ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి.కాలు కదపడకుండా డబ్బులు సంపాదించాలని భావించే వారికి తాజాగా ఓ ఉద్యోగం అందరిని ఆకట్టుకుంటుంది.

 24 Hours, Job, Lock Donw, Account, Applications, Slippers,bed Room Athalatics,sl-TeluguStop.com

అదేంటి అని పూర్తి వివరాల్లోకి వెళితే.

ఉద్యోగం పొందిన వ్యక్తి జస్ట్ చెప్పులు వేసుకుంటే చాలు 4 లక్షలు వచ్చి వారి అకౌంట్లో పడిపోతాయి.

వావ్.ఇలాంటి ఉద్యోగం భలే ఉంది కదా అని అనుకుంటున్నారు కదా అయితే, మన భారతీయులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం కాస్త కష్టమైన చెప్పాలి.

ఇక ఈ ఉద్యోగానికి సంబంధించి వివరాల్లోకి వెళితే ఇంగ్లాండ్ దేశానికి చెందిన బెడ్ రూమ్ అథ్లెటిక్స్ అనే సంస్థలో రెండు ఖాళీలు ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.ఉద్యోగం పేరు స్లిప్పర్ టెస్టర్.

ఈ ఉద్యోగం కోసం కంపెనీ ఒక మహిళ, ఒక పురుషుడును నియమించకబోతోంది.ఇకపోతే ఈ ఉద్యోగం పొందిన వ్యక్తి ఈ సంవత్సరంలో నుండి తయారయ్యే కొత్త డిజైన్ చెప్పులను ధరించి దానికి సంబంధించిన రివ్యూలు ఇస్తే చాలు జీతం వచ్చి వారి అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది.

అయితే ఈ ఉద్యోగంలో ఎన్నో రకాల చెప్పులు వేసుకోవాల్సిన అవసరమే లేదు.అది కూడా వారు నెల మొత్తం కష్టపడాల్సిన అవసరమే లేదు.

కేవలం నెలలో రెండంటే రెండు రోజులు మాత్రమే ఒక రోజుకు 12 గంటలు చొప్పున ఆ చెప్పులను ధరిస్తే చాలు.ఒక నెలకు 4 లక్షలు మీ సొంతం.

ఇందుకు సంబంధించి కంపెనీ అధికారులు మాట్లాడుతూ.ఈ లాక్ డౌన్ సమయంలో పార్ట్ టైం జాబ్ చేసే వారు ఎక్కువ అయిపోయారని, అలాంటి వారికి ఇది చాలా మంచి ఉద్యోగం అని చెప్పుకొచ్చారు.

ఈ ఉద్యోగం కేవలం ఇంట్లో కూర్చొని చేస్తే చాలు అంటూ వారు పేర్కొనడం విశేషం.ఈ ఉద్యోగం కోసం ఆసక్తి గల వ్యక్తులు బెడ్ రూమ్ అథ్లెటిక్స్ అనే వెబ్సైట్ కి వెళ్లి అక్కడ అప్లికేషన్ ను పెట్టేస్తే చాలు.

అదృష్టం మీ వెంట ఉంటే జాబ్ మీదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube