బాలింత‌లు ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే!

గ‌ర్భం దాల్చ‌డం అనేది ప్ర‌తి మ‌హిళ జీవితంలోనూ అద్భుత‌మైన, ఆనంద‌క‌ర‌మైన ఘ‌ట్టం అని చెప్పాలి.అయితే గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు ఎంతో కేరింగ్‌గా ఉండే మ‌హిళ‌లు.

 Good Food For Woman After Delivery-TeluguStop.com

గ‌ర్భం దాల్చాక త‌మ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెట్ట‌డం మానేస్తుంటారు.కానీ, అలా చేయ‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు ఎద‌ర్కోవాల్సి వ‌స్తుంది.

వాస్త‌వానికి గర్భిణి కంటే బాలింతకే పౌష్టికాహారం ఇవ్వాలి.అప్పుడే వారు ఆరోగ్యంగా, బ‌లంగా మార‌తారు.

 Good Food For Woman After Delivery-బాలింత‌లు ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక గ‌ర్భం దాల్చిన త‌ర్వాత బాలింత‌లు ఖ‌చ్చితంగా కొన్ని ఆహార ప‌దార్థాల‌ను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా బాలింత‌ల్లో ర‌క్త హీన‌త స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది.ఇలాంటి స‌మ‌యంలో ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్‌, తేనే, బెల్లం, బీట్‌రూట్‌, క్యారెట్ వంటి తీసుకోవాలి.వీటి వ‌ల్ల ర‌క్త వృద్ధి జ‌రుగుతుంది.మ‌రియు ఇనుము అధికంగా ఉంటే ఓట్స్‌ను కూడా డైట్‌లో చేర్చుకోవాలి.

త‌ద్వారా ర‌క్త హీన‌త త‌గ్గ‌డంతో పాటు అల‌స‌ట‌, నీర‌సం రాకుండా ఉంటుంది.
అలాగే ప‌చ్చి బొప్పాయి తీసుకోవ‌డం వ‌ల్ల బాలింత‌ల‌కు బోలెడ‌న్ని పోష‌కాలు ల‌భిస్తాయి.

అదే స‌మ‌యంలో పిల్లలకు సరిపడా పాలు వృద్ధి చెందేలా చేస్తుంది.మ‌రియు వెల్లుల్లి కూడా బాలింత‌ల్లో పాలు పెరిగేందుకు ఉప‌యోగ‌ప‌డ‌డంతో పాటు రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌డేలా చేస్తుంది.

కాబ‌ట్టి, వెల్లుల్లిని ఖ‌చ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.ఇక ప్ర‌తి రోజు పాలు, పెరుగు, మజ్జిగ త‌ప్ప‌ని స‌రిగా తీసుకోవాలి.

వీటి వ‌ల్ల బాలింత‌ల‌కు కాల్షియం, ఏ, డీ విటమిన్స్ ల‌భిస్తాయి.
అదేవిధంగా.

బార్లీ, బ్రౌన్ రైస్ వంటి వాటిలో అన్ని న్యూట్రియెంట్స్ ఉంటాయి.మ‌రియు క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.

కాబ‌ట్టి, బాలింత‌లు రైస్‌కు బ‌దులుగా వీటిని తీసుకోవ‌డం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.అలాగే సీజ‌న్ ఫ్రూట్స్‌తో పాటు తాజా కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు తీసుకోవాలి.ఆకుకూర‌ల్లో ముఖ్యంగా పాల‌కూర‌, తోట‌కూర, మెంతికూర‌ త‌ప్ప‌కుండా తీసుకోవాలి.ఇక మెంతులు కూడా బాలింత‌ల‌కు చాలా మేలు చేస్తాయి.కాబ‌ట్టి, మెంతుల‌ను ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో బాలింత‌లు తీసుకోవాలి.

#Delivery #Delivery #Pregnancy #Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు