చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

చర్మానికి సంబందించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే విటమిన్స్ సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.జంక్ ఆహారాలకు దూరంగా పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకుంటే చర్మ ఆరోగ్యంతో పాటు చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది.

 Good Food For Skin To Avoid Skin Related Diseases-TeluguStop.com

ఈ ఆహారాలను రెగ్యులర్ డైట్ లో భాగంగా చేసుకోవాలి.ఇప్పుడు ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

క్యారెట్

క్యారెట్ లలో విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది.క్యారెట్ లో ఉండే విటమిన్ సి చర్మం పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది.క్యారెట్ లో ఉండే పీచు, పొటాషియం, ధయామైన్ వంటి పోషకాలు చర్మ సమస్యలు రాకుండా కాపాడతాయి.

 Good Food For Skin To Avoid Skin Related Diseases-చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నీరు

నీరు అనేది చర్మానికి మాత్రమే కాదు శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.శరీరంలో సరిపడా నీరు ఉంటే చర్మం మెరుస్తూ ఉంటుంది.

సాల్మన్

సాల్మన్ చేపలలో సమృద్ధిగా ఉండే ఫ్యాటీ యాసిడ్లు చర్మానికి రక్షణ కల్పిస్తాయి.అంతేకాకుండా ఇందులో వుండే ఒమేగా 3 విటమిన్ కొరతను తొలగించి పొటాషియం, ప్రొటీన్లు, సెలీనియం లభించేలా కూడా చేస్తుంది.

బ్లూబెర్రీలు

బ్లూబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ బారి నుండి కాపాడతాయి.శరీర కణాలకు ఎటువంటి డ్యామేజీ జరగకుండా కాపాడుతుంది.అంతేకాక వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది.అల్ట్రా వయోలెట్ కిరణాల నుండి చర్మాన్ని కాపాడతాయి.

అంతేకాక చర్మ కణ పొరలను రక్షిస్తాయి.

Good Food For Skin To Avoid Skin Related Diseases Details, Skin Care Tips, Healthy Skin, Skin Diseases, Good Food, Vitamins, Proteins, Green Tea, Blu Berries, Solmon, Water, Carrot - Telugu Blu, Carrot, Green Tea, Healthy Skin, Proteins, Skin Care Tips, Skin Diseases, Solmon, Vitamins

#Green Tea #Proteins #Blu #Care Tips #Solmon

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube