గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు

రక్తంలో కొల్లెస్టరాల్, ట్రిగ్లీసెరైడ్ స్ధాయిలు బాగా పెరిగిపోయాయని మీకు ఇష్టమైన ఆహారాలను తినటం ఆపేసారా? మీరు ఆపాల్సిన అవసరం లేదు.మంచి కొలస్ట్రాల్ తో భర్తీ చేయవచ్చు.

 Good Cholesterol Rich Foods-TeluguStop.com

రక్తంలో చెడు కొలస్ట్రాల్ ఎక్కువైతే దానిని మంచి కొలస్ట్రాల్ ఆహారాలతో సులభంగా తొలగించవచ్చు.అయితే మన శరీరంలో మంచి కొలస్ట్రాల్ ఉండాలంటే ఎటువంటి ఆహారాలను తీసుకోవాలో ఒక్కసారి తెలుసుకుందాం.

ఆరెంజ్ జ్యూస్ – ఇంటిలో తాజాగా తయారుచేసుకునే ఆరెంజ్ రసం లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా వుండి రక్తనాళాలలోని గడ్డలను కరిగించి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తుంది.ప్రతి రోజు ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యుస్త్రాగితే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

 Good Cholesterol Rich Foods-గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వెల్లుల్లి – మనం ప్రతి రోజు ఉపయోగించే వెల్లుల్లిలో మంచి కొలస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది.వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకుంటే రక్తనాళాలలోని లోపలి అంచులు గట్టిపడకుండా చేస్తుంది.

అలాగే రక్తనాళాల్లోకొవ్వు పేరుకోకుండా చూస్తుంది.అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనుఅందిస్తుంది.

ప్రతి రోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మంచిదని వైద్య నిపుణలు సూచిస్తున్నారు.

రెడ్ వైన్ – ఆల్కహాల్ తాగటం అలవాటు లేని వారికి కూడా ఇది బాగుంటుంది.ఇది ఇంచుమించుగా ద్రాక్షరసంతో సమానం.కొల్లెస్టరాల్ స్ధాయిలను సాధారణ స్థితిలో ఉండేలా చూస్తుంది.

అయితే రెడ్ వైన్ ని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి.అప్పుడే గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాలు ఎప్పటికపుడు శుభ్రపడి రక్త సరఫరా ఫ్రీ గా జరిగేలా చూస్తుంది.

#Foods Heart #Heart Problems #Orange #Red Wine

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube