తమిళ రాజకీయాలకు గుడ్ బై..శశికళ సంచలన నిర్ణయం..!!

వచ్చే నెల ఆరవ తారీఖు తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా గడుపుతూ ఉన్నారు.

 Good Bye To Tamilnadu Politics Shashikala Sensational Decision-TeluguStop.com

ఎలాగైనా ఈ ఎన్నికలలో విజయం సాధించాలని వ్యూహాలు ప్రతివ్యూహాలతో ప్రజలలోకి రాజకీయ నాయకులు వెళ్తున్నారు.ఇప్పటికే రెండుసార్లు అన్నాడీఎంకే పార్టీ వరుసగా విజయం సాధించడంతో ఈ సారి మరో పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు అక్కడ జరుగుతున్న సర్వేలలో ఫలితాలు వస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో శశికళ ఇటీవల జైలు నుంచి విడుదల అయిన తరువాత తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

 Good Bye To Tamilnadu Politics Shashikala Sensational Decision-తమిళ రాజకీయాలకు గుడ్ బై..శశికళ సంచలన నిర్ణయం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పార్టీ నుంచి బహిష్కరణ అయిన శశికళ మళ్లీ అన్నాడీఎంకే పార్టీ లోకి వెళ్ళడానికి ఇటీవల ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు తమిళ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

మరోసారి అన్నాడీఎంకే పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా శశికళ అంతర్గతంగా కొంతమంది నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు ఈ క్రమంలో బిజెపి రాయబారాన్ని కూడా కోరినట్లు ప్రచారం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా తాజాగా శశికళ తమిళనాడు రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెబుతూ సంచలన ప్రకటన చేశారు.

సరిగ్గా త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆమె తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సంచలనం అయ్యింది.ఈ క్రమంలో ఆమె రాసిన లెటర్ లో జయలలిత బతికున్నప్పుడు ఎలాంటి అధికారం కోసం లేదా పార్టీలో పదవి కోసం పాకులాడలేదు.

ఆమె చనిపోయిన తర్వాత కూడా వాటికోసం ఆశపడటం లేదు అంటూ లెటర్ లో పేర్కొన్నారు.ఇదే తరుణం లో జరగబోయే ఎన్నికలలో డీఎంకే పార్టీ ని ఓడించాలని అన్నాడిఎంకె కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

#Jayalalitha #Sasikala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు